ETV Bharat / state

ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవోను నిర్బంధించిన ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం - ఫీవర్ ఆస్పత్రి డీఎంవో సుల్తానా

fever-hospital-dmo-sultana-gets-one-lakh-fifteen-thousand-rupees-for-corona-treatment
ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవోను నిర్బంధించిన ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం
author img

By

Published : Jul 5, 2020, 12:29 PM IST

Updated : Jul 5, 2020, 1:27 PM IST

07:45 July 05

ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవోను నిర్బంధించిన ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం

ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవోను నిర్బంధించిన ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం

ఫీవర్  ఆస్పత్రి డీఎంవో సుల్తానాను ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం నిర్బంధించింది. ఫీవర్  ఆస్పత్రిలో అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ అయిన సుల్తానాకు... పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. చికిత్స నిమిత్తం ఆమె చాదర్​ఘాట్​లోని తుంబె ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో రోజుకు ఏకంగా లక్షా పదిహేను వేల బిల్లు వేసినట్లు సుల్తానా సెల్ఫీ వీడియోలో వెల్లడించారు.

'' కరోనాతో నేను చాదర్​ఘాట్​లోని తుంబె ఆస్పత్రిలో చేరాను. ఈ యాజమాన్యం ఒక్క రోజుకు లక్షా 15 వేల రూపాయల బిల్లు వేస్తున్నారు. నా సోదరుడు ఇద్దరికి కలిపి లక్షా  5వేలరూపాయలు  కట్టాడు. డిశ్చార్జ్ చేయమని అడిగితే వాళ్లు మమ్మల్ని నిర్బంధించారు. మాతో సరిగా ప్రవర్తించడంలేదు. సరైన చికిత్స అందిచట్లేదు. మందులు సైతం సమయానికి ఇవ్వకుండా... ఆహారం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.''

-సుల్తానా, ఫీవర్ ఆస్పత్రి డీఎంవో

నా కూతురు, సోదరి, సోదరుడు సైతం కోవిడ్ బారిన పడ్డామని సుల్తానా వెల్లడించారు. రోజుకు లక్ష కట్టడం తమ వల్ల కాదని... తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Last Updated : Jul 5, 2020, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.