ఖైరతాబాద్ మహా వినాయకుడిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని.. దేవాదాయ శాఖ మంత్రిగా ఏటా ఇక్కడికి వస్తానని మంత్రి అన్నారు. దేశంలో 61 అడుగుల వినాయకుడు ఇక్కడ తప్ప మరెక్కడ లేదని... ఒక్కో దగ్గర ఒక్కో ప్రత్యేకత ఉంటుందన్నారు. ఇక్కడ ఖైరతాబాద్ లంబోదరుడు ప్రత్యేకమని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఐలమ్మ ఆశయాలు సాధిస్తాం: ఎర్రబెల్లి