ఒడిశాలోని భువనేశ్వర్ ప్రధాన కేంద్రంగా ఉన్నతూర్పు కోస్తారైల్వే నడిపే అన్ని ప్రత్యేక రైళ్లను డిసెంబరు ఆఖరి వారం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు.
తూర్పు కోస్తానుంచి నడుస్తున్న రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి
- 08479/08480 భువనేశ్వర్-తిరుపతి (వారాంతపు ప్రత్యేక రైలు) ప్రతి శనివారం భువనేశ్వర్ నుంచి ఆదివారం తిరుపతి నుంచి బయలుదేరుతుంది.
- 02839/02840 భువనేశ్వర్-చెన్నై-భువనేశ్వర్ (వీక్లీ స్పెషల్) ప్రతి గురువారం భువనేశ్వర్ నుంచి, శుక్రవారం చెన్నై నుంచి బయలుదేరుతుంది.
- 02845/02846 భువనేశ్వర్ - బెంగళూరు; కంటోన్మెంట్- భువనేశ్వర్ (వీక్లీ స్పెషల్) ప్రతి ఆదివారం భువనేశ్వర్ నుంచి, ప్రతి మంగళవారం బెంగళూర్ కంటోన్మెంట్ నుంచి బయలుదేరుతుంది.
- 02898/02897 భువనేశ్వర్ - పుదుచ్చేరి - భువనేశ్వర్ (వీక్లీ ప్రత్యేక రైలు) మంగళవారం భువనేశ్వర్ నుంచి, బుధవారం పుదుచ్చేరి నుంచి బయలుదేరుతుంది.
- 05.08496/08495 భువనేశ్వర్ - రామేశ్వరం- భువనేశ్వర్ (వీక్లీ ప్రత్యేక రైలు) ప్రతి శుక్రవారం భువనేశ్వర్ నుంచి ప్రతి ఆదివారం రామేశ్వరం నుంచి బయలుదేరుతుంది.
- 02859/02860 పూరి - చెన్నై- పూరి (వారాంతపు ప్రత్యేక రైలు) ప్రతి ఆదివారం పూరి నుంచి , ప్రతి సోమవారం చెన్నై నుంచి బయలు దేరుతుంది.
- 02851/02852 విశాఖ- నిజాముద్దీన్ - విశాఖ (బైవీక్లీ ఎక్స్ప్రెస్) విశాఖ నుంచి ప్రతి సోమ, శుక్రవారాల్లలోనూ, నిజాముద్దీన్ నుంచి బుధ,ఆదివారాల్లో బయలు దేరుతుంది.
- 02887/02888 విశాఖ- నిజాముద్దీన్ -విశాఖ ప్రతి మంగళ, బుధ , గురు, శని, ఆది వారాల్లో విశాఖ నుంచి, సోమ, మంగళ, గురు, శుక్ర, శని వారాల్లో నిజాముద్దీన్ నుంచి ఈ రైలు బయలు దేరుతుంది.
- 02869/02870 విశాఖ- చెన్నై -విశాఖ ప్రత్యేక రైలు ప్రతి సోమవారం, చెన్నై నుంచి ప్రతి మంగళ వారం బయలుదేరుతుంది.
- 02857/02858 విశాఖ - ఎల్టీటీ (ప్రత్యేక రైలు) ప్రతి ఆదివారం విశాఖ నుంచి, ఎల్టీటీ నుంచి ప్రతి మంగళవారం బయలుదేరుతుంది.
- 08501/08502 విశాఖ పట్నం- గాంధీగ్రామ్ -విశాఖపట్నం (ప్రత్యేక రైలు) ప్రతి గురువారం విశాఖ నుంచి ,ప్రతి అదివారం గాంధీ గ్రామ్ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది.
- 07488/07487 విశాఖ- కడప - విశాఖ ప్రతి రోజూ డిసెంబర్ 31 వరకు ప్రత్యేక రైలుగా నడుపుతారు.