ETV Bharat / state

నేషనల్ టెన్నిస్ ఛాంపియన్​షిప్ విన్నర్​కు సన్మానం

చెన్నైలోని మద్రాస్ క్రికెట్ క్లబ్​లో జరిగిన నేషనల్ టెన్నిస్ ఛాంపియన్​షిప్​లో గెలుపొందిన కుమారి శ్రీవల్లి రష్మికను హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్​ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి హాజరయ్యారు.

శ్రీవల్లి రష్మికను సన్మానిస్తున్న పెద్దలు
author img

By

Published : Aug 20, 2019, 7:09 PM IST

క్రీడ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్​ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. చెన్నైలోని మద్రాస్ క్రికెట్ క్లబ్​లో జరిగిన నేషనల్ టెన్నిస్ ఛాంపియన్​షిప్​లో గెలుపొందిన కుమారి శ్రీవల్లి రష్మిక సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆరేళ్లలో వివిధ క్రీడల్లో రాష్ట్రం నుంచి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు.

కృతజ్ఞతలు

తాను ఈ స్థాయికి రావడానికి కారకులైన కోచ్​కు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీవల్లి రష్మిక... రానున్న రోజుల్లో మరిన్ని ఛాంపియన్​షిప్​లు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ తీగల అనితరెడ్డితో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

నేషనల్ టెన్నిస్ ఛాంపియన్​షిప్ విన్నర్​కు సన్మానం

ఇదీ చదవండిః గాంధీ 150: మహాత్ముని జీవనమే సంస్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.