Students on Russia-Ukraine Crisis: కన్నపేగు అక్కడ.. కన్నీళ్లతో ఇక్కడ - ts news
Students on Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం హైదరాబాద్‌లోని ఆజంపురలో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం నడుమ నాలుగు రోజుల నుంచి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన నగర విద్యార్థులు భారత ఎంబసీ అధికారుల చొరవతో ఎట్టకేలకు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఎదుర్కొన్న భయానక అనుభవాలను ఈటీవీ భారత్‌తో పంచుకున్నారిలా..
Students on Russia-Ukraine Crisis: కన్నపేగు అక్కడ.. కన్నీళ్లతో ఇక్కడ
By
Published : Feb 28, 2022, 2:07 PM IST
Students on Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నగరంలోని వందలాది మంది తల్లిదండ్రులను భయాందోళనలోకి నెట్టింది. విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి తరలిస్తున్నారని తెలిసి తమ పిల్లలే ఇంటికి వస్తారని ఎదురుచూస్తున్నా సమాచారం లేక ఆవేదనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని డబీర్‌పురా, పీర్జాదిగూడ, ఖైరతాబాద్, నాచారం తదితర ప్రాంతాలకు చెందిన 16మంది విద్యార్థులు వైద్య విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లగా వారి తల్లిదండ్రులు ఆదివారం ఆజంపుర ఫర్హత్‌నగర్ సాబ్రియా హాల్లో సమావేశమయ్యారు. ఎవరిని కదిలించినా కన్నీళ్లు ఆగడం లేదు. ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఉక్రెయిన్‌లో తమ పిల్లలను అక్కడి దేశ సరిహద్దులకు రావాలని, అక్కడి నుంచి ఇండియాకు తరలిస్తామని భారత రాయబార అధికారులు చెబుతున్నారని, కానీ సరిహద్దుల వరకు వచ్చే అవకాశం లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అక్కడి కళాశాల భవనాల కింద బంకర్లలో తమ పిల్లలు తలదాచుకున్నారని, బయటకు రావద్దని అక్కడి అధికారులు చెబుతుండడంతో భారత్‌కు వచ్చే దారి కనిపించడంలేదని కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రాయబార అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
ఎంబసీవారు త్వరగా స్పందించారు..
ప్రియాంక, నాదర్‌గుల్
చెర్నవిట్స్‌లోని బుకోవినియన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నా. యుద్ధం ప్రారంభం కావడంతో ఒకింత భయం వేసింది. పశ్చిమ ప్రాంతంలో యుద్ధ వాతావరణం కన్పించలేదు. కీవ్‌లో రష్యా దాడులు జరిపినప్పుడు ఆ ప్రాంతానికి దరిదాపుల్లోనే మా ప్రాంతం ఉంది. వెంటనే ఎంబసీనీ సంప్రదించా. స్వదేశానికి తీసుకెళ్తామని అభయమిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం రుమేనియా ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కాం.
భయభ్రాంతులకు గురయ్యాం..
అలేఖ్య, మౌలాలి
బాంబుల శబ్దంతో భయభ్రాంతులకు గురయ్యాం. భవనాల కిటికీల అద్దాలు ధ్వంసం అవుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నాలుగు రోజులు గడిపాం. ఎట్టకేలకు భారత రాయబార కార్యాలయం అధికారుల చొరవతో స్వదేశానికి క్షేమంగా చేరుకున్నాం. నా స్నేహితులు చాలామంది ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు.
సహాయానికి ఎదురు చూస్తున్నారు..
దీప్తి, కుత్బుల్లాపూర్
భయం గుప్పిట్లో ఇన్ని రోజులు గడిపాం. భారత రాయబార కార్యాలయం అధికారుల చొరవతో రుమేనియా విమానాశ్రయం నుంచి ముంబయి మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నాం. ఉక్రెయిన్‌లో సహాయం కోసం వేలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
8 కి.మీలు నడిచాం..
ఉజ్రాద్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నా. తొలుత కీవ్‌లోని విమానాశ్రయం చేరుకున్నాం. అక్కడి ఎయిర్‌పోర్టులో రాకపోకలు నిలిపివేశారని తెలియడంతో వెనుదిరిగాం. ఉక్రెయిన్ సరిహద్దులకు వెళ్లడానికి 8 కిలోమీటర్లు నడిచి రుమేనియాకు చేరుకున్నాం.