ETV Bharat / state

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో 'ఫీడ్​ ద నీడ్ ​'

'ఫీడ్​ ద నీడ్​'...  ఈ పేరు వింటే ఫంక్షన్లు, హోటళ్లలో మిగిలిన ఆహారాన్ని సేకరించి పేద వారికి పంచిపెట్టే కార్యక్రమం గుర్తుకు వస్తుంది. ఆహారాన్ని పారేయకుండా తీసుకొచ్చి అన్నార్థులకు అందించేందుకు ఫ్రిజ్​లను ఏర్పాటు చేస్తున్నారు. జీహెచ్​ఎంసీ, ఆపిల్​ హోమ్​ స్వచ్ఛంద సంస్థ తాజాగా సికింద్రాబాద్​ రైలు నిలయంలో మరొకటి ఏర్పాటు చేశారు.

author img

By

Published : May 9, 2019, 2:27 PM IST

పీడ్​ ద నీడ్​

పెళ్లిళ్లు, ఫంక్షన్లు, హోటళ్లలో వృథాగా పారేస్తున్న ఆహారాన్ని సేకరించే కార్యక్రమం ఫీడ్​ ధ నీడ్​కు ఆదరణ పెరుగుతోంది. ఆపిల్​ హోమ్​ స్వచ్ఛంద సంస్థ, జీహెచ్​ఎంసీ సంయుక్తంగా నిర్వహిస్తోన్న కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ ఎదురుగా నూతనంగా ఆహార పదార్థాల రిఫ్రిజిరేటర్​ను ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని పేద వారికి, రైల్వే ఫుట్​పాత్​లపై ఉండే వారికి ఆహారాన్ని అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మోండా మార్కెట్​ కార్పోరేటర్​ ఆకుల రూప, స్వచ్ఛంద సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

అన్నార్థుల ఆకలి తీర్చే ఫీడ్​ ద నీడ్​

ప్రధాన సమస్య

ఆహార పదార్థాలను వృథా చేయడం దేశంలో ప్రధాన సమస్యగా మారిందని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు రాజేష్​ తెలిపారు. సరైన ఆహారం లేక చాలామంది చనిపోతున్నారని అన్నారు. దాతలు మరింత స్పందించాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాల చేపట్టడం వల్ల ఆనందంగా ఉందని అన్నారు. ఆహార పదార్థాల ఫ్రిజ్​లను జాగ్రత్తగా కాపాడు కోవాలని సూచించారు.

ఇదీ చూడండి : భానుడి భగభగలు.. ఆరోగ్య సూత్రాలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.