న్యాయవాదుల హత్య కేసును సీబీఐతో వెంటనే విచారణ జరిపించాలని.. దోషులకు కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని స్పష్టం చేశారు.
శోచనీయం..
రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లేదని.. దంపతులను హత్య చేసి 10 రోజులవుతున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఇంత వరకూ స్పందించకపోవడం శోచనీయమని విమర్శించారు. ప్రభుత్వానికి తమపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందని మండిపడ్డారు. లాయర్లపై హత్యలు, దాడులు నిరసిస్తూ.. మార్చి 9న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అడుగు పెట్టనీయం..
న్యాయవాది దంపతుల హత్యపై మార్చి 9 లోపు కేసీఆర్ స్పందించకుంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బార్ అసోసియేషన్‌లోకి అడుగు పెట్టనీయమని తెల్చిచెప్పారు. తెలంగాణ సాదనకు పోరాడిన న్యాయవాదులు ఇప్పుడు.. తమ రక్షణ కోసం పోరాటం చేస్తామని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ అన్నారు. దంపతుల హత్య ప్రభుత్వానిదేనని.. అందుకే ముఖ్యమంత్రి, మంత్రులకు మాట్లాడటం లేదని ఆరోపించారు.
ఇదీ చూడండి: బిట్టు శ్రీనును పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు