ETV Bharat / state

Fathers Day: నాన్న మీ పాత్ర మరువలేం.. - హైదరాబాద్​ వార్తలు

ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర వెలకట్టలేనిది. వారుంటే పిల్లలకు భరోసా. మనం అమ్మ గురించి కాస్తా ఎక్కువే చెబుతాం.. చెప్పాలి కూడా.. ఎందుకంటే అమ్మ లేకుంటే మనం ఇక్కడ లేం.. ఉండం కూడా! కానీ నాన్న గురించి కూడా చెప్పుకోవాలి. తండ్రి కూడా తల్లితో సమానంగా మన కోసం అహర్నిశలు శ్రమిస్తుంటాడు.

fathers day
ఫాదర్స్​ డే
author img

By

Published : Jun 20, 2021, 6:48 AM IST

Updated : Jun 20, 2021, 7:21 AM IST

నాన్న మన కోసం శ్రమించే నిస్వార్థ జీవి.. తనలోని బాధని మనకు తెలియనీయకుండా తనలోనే దాచుకునే బోలా శంకరుడు.. అలాంటి తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడే! మనం ఎగిరే గాలిపటం.. మనల్ని ఎగిరేసిది అమ్మ.. ఆ రెండింటి మధ్య దారం ఉంటుంది. అది కనిపించదు. నాన్న ప్రేమ కూడా అంతే.. దారంలాంటిదే.. చూసేవారికి కనిపించదు!

అమ్మకు ఎదైనా బాధ వస్తే నాన్నకు చెప్పుకుంటుంది. తల్లీకి దుఃఖం వస్తే ఎడుస్తుంది. కానీ నాన్నకు బాధ వస్తే.. దుఃఖం వస్తే.. తన బాధ భార్యాపిల్లలకు చెబితే ఏమవుతారో అని తనలోనే దాచుకునే వ్యక్తి తండ్రి.. మనం గెలిస్తే తను గెలిచినట్లు ఆనందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నాన్న మాత్రమే.. ప్రతీ తండ్రి.. తన పిల్లలు తనకన్నా బాగా బతకాలని ఆలోచిస్తుంటాడు. ఆ క్రమంలో మనతో కఠినంగా ఉంటాడే తప్ప మనపై కోపంతో అలా చేయడు.. చిన్నప్పుడు మనం స్కూల్​ వెళ్లకుంటే నాన్న.. బెదిరించో, బుజ్జగించో బడికి పంపిస్తాడు. అప్పుడు తండ్రి అంటే భయం, కోపమేస్తుంది. కానీ తర్వాత తెలుస్తోంది. నాన్న ఎందుకు అలా చేశాడో.

తల్లీదండ్రుల తమ పిల్లలు బాగుండాలని ఎంతో కష్టబడతారు. ఓ పూట తిని, మరో పూట పస్తులుండి మనల్ని చదివిస్తారు. మనల్ని ప్రయోజకుల్ని చేస్తారు. మనం ఏ స్థాయిలో ఉన్నా దానికి కారణం మన అమ్మనాన్నే కానీ.. మనకు పెళ్లిలు, పిల్లలయ్యాక వారిని భరించలేకపోతున్నాం. ఏ వృద్ధశ్రమంలో వదిలేసి వెళ్లిపోతున్నాం. కొందరైతే తల్లిదండ్రులు చనిపోతే కనీసం అంత్యక్రియలకు కూడా రావడం లేదు.. కానీ ఏదో ఒక రోజు తమకూ అదే గతి వస్తుందని వారు గమనించడం లేదు. ఏదీ ఏమైనా.. తల్లిదండ్రులను చూసుకోవడం మన బాధ్యత..

ఇదీ చదవండి: ETELA: 'ప్రభుత్వ పథకాలు.. ప్రజల చెమట సొమ్మే'

Last Updated : Jun 20, 2021, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.