ETV Bharat / state

బాధను దిగమింగుకుంటూ... కొడుకు శవాన్ని మోసుకుంటూ... - latest news on lock down in ananthapura

పేదరికం కొడుకును పొట్టన పెట్టుకుంది.. చివరికి అంత్యక్రియలు చేయడానికి చిల్లి గవ్వ లేదు.. లాక్​డౌన్​ నేపథ్యంలో తండ్రి ఒక్కడే కుమారుడి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

FATHER WALKS WITH SONS DEADBODY
కొడుకు శవంతో... తండ్రి ఒక్కడే...
author img

By

Published : Mar 28, 2020, 11:47 AM IST

Updated : Mar 28, 2020, 12:05 PM IST

లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో ఓ తండ్రి కుమారుడి మృతదేహాన్ని చేతులపై శ్మశాన వాటికకు తీసుకెళ్లిన హృదయ విదారక ఘటన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. కదిరికి చెందిన మనోహర్‌, రమణమ్మలు గోరంట్లలోని మాధవరాయ ఆలయం వెనుక ప్రాంతంలో నివసిస్తున్నారు. రోజంతా చెత్త నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి విక్రయిస్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది.

మనోహర్ పెద్ద కుమారుడు దేవా (11) గత శనివారం తీవ్ర అనారోగ్యానికి గురవటంతో తొలుత ప్రైవేటు వైద్యుడి వద్ద చికిత్స చేయించారు. మందులు కొనలేక.. ఆదివారం గోరంట్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హిందూపురం పంపించారు. అక్కడ మూడు రోజులు చికిత్స చేసి బుధవారం బెంగళూరు లేదా అనంతపురం తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

అంత దూరం తీసుకెళ్లే స్తోమత లేక అక్కడే ఉండిపోవడంతో బాలుడి పరిస్థితి విషమించి చనిపోయాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చినా, అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వలేక అష్టకష్టాలు పడ్డారు. మెరుగైన వైద్యం ఉంటే తమ కుమారుడు బతికేవాడని దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. లాక్​డౌన్​ నేపథ్యంలో అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కొడుకు మృతదేహాన్ని చేతులపై ఎత్తుకుని శ్మశాన వాటికకు తీసుకెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

ఇదీ చదవండి: విస్తరిస్తున్న కరోనా... ఒక్కరోజే 14 మందికి

Last Updated : Mar 28, 2020, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.