ETV Bharat / state

కూతురు నగ్న చిత్రాలు తీసిన తండ్రి... నిందితుడు అరెస్ట్

''నీకు భార్య చనిపోతే మా అమ్మను పెళ్లి చేసుకుని తనకు కొత్త జీవితం ఇచ్చావు. నన్ను ప్రేమగా చూసుకున్నావ్. తండ్రి లేని లోటును నువ్వే తీర్చావు. కొండంత ధైర్యంగా అండగా నిలిచావు. నాకు ఏ ఆపద వచ్చినా నన్ను రక్షిస్తావనే భరోసాను ఇచ్చావు. కానీ... నువ్వేందుకు ఇలా చేశావు నాన్న. నీ ల్యాప్​టాప్​లో నా చిత్రాలు చూడగానే నాకు భయం వేయలేదు. నువ్వేనా ఇలా చేసింది అని బాధ వేసింది.'' - ఓ కూతురి మనోవేదన

father-having-nude-pictures-of-daughter
కూతురు నగ్న చిత్రాలు తీసిన తండ్రి... నిందితుడు అరెస్ట్
author img

By

Published : Aug 19, 2020, 12:21 PM IST

Updated : Aug 19, 2020, 12:29 PM IST

హైదరాబాద్‌లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రాజేశ్​(60) అనే వ్యక్తి తన భార్య చనిపోవడంతో మరో మహిళను వివాహం చేసుకున్నాడు. రెండో భార్య, ఆమె కుమార్తె(20) నాచారం పరిధిలో నివాసముంటున్నారు.

పని నిమిత్తం యువతి... తన సవతి తండ్రి ల్యాప్​టాప్​ను తీసుకుంది. దానిని ఆన్​ చేయగానే యువతికి ఆమె నగ్నంగా ఉన్న ఫొటోలు దర్శనమిచ్చాయి. వాటిని చూసిన కుమార్తె కుంగిపోయింది. మంచిగా కనిపించే తన సవతి తండ్రి... ఇంతంటి నీచమైన పని చేస్తాడని ఊహించలేకపోయింది. తల్లికి చెప్పలేక తనలో తానే క్షోభను అనుభవించింది.

అనంతరం ధైర్యం చేసి తల్లికి జరిగిన విషయాన్ని చెప్పింది. ఇద్దరు కలిసి నిందితుడిపై నాచారం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా... పోలీసులు రాజేశ్​ను అరెస్టు చేశారు. అతనిని జైలుకి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా ఆ ప్రబుద్ధుడికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో అతనిని వదిలిపెట్టారు. నిందితుడు వైరస్ నుంచి కోలుకున్నట్లు గుర్తించిన పోలీసులు మరోసారి అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: వరుణాగ్రహం... ఇంటి పైకప్పు కూలి తల్లీకూతుళ్ల దుర్మరణం

Last Updated : Aug 19, 2020, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.