ETV Bharat / state

పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి? - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

నా వయసు 43. ఎత్తు అయిదడుగుల నాలుగు అంగుళాలు. బరువు 70 కిలోలు. నా సమస్య ఏమిటంటే... చేతులు, కాళ్లు సన్నగా ఉంటాయి. పొట్ట మాత్రం చాలా ఎత్తుగా ఉంటుంది. అది తగ్గడానికి ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?

fat-reduce-tips-for-woman-by-doctor-janaki-srinath
పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి?
author img

By

Published : Jan 6, 2021, 12:42 PM IST

శారీరక శ్రమ లేకపోవడం, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో గంటల కొద్దీ కూర్చొని ఉండటం, ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల మహిళల్లో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావడానికి మీరేం చేయాలంటే... రోజూ ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోవాలి. అరగంటైనా శారీరక శ్రమ చేయాలి. వారానికి మూడుసార్లు ఏరోబిక్‌ ఎక్సర్‌సైజ్‌లు, మిగతా రెండు రోజులు బరువులు ఎత్తే, శక్తినిచ్చే వ్యాయామాలను కచ్చితంగా చేయాలి.

fat-reduce-tips-for-woman-by-doctor-janaki-srinath
డా.జానకి శ్రీనాథ్

ఆహారం విషయానికి వస్తే.... చక్కెర, బెల్లం, స్వీట్స్‌, కేక్స్‌.... లాంటి తేలికగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్ల వాడకం తగ్గించాలి. పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే పాలిష్‌ బియ్యం, అటుకులు తగ్గించాలి. వీటి స్థానంలో తాజా కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. అన్నం మాత్రమే తినాలనుకుంటే తీసుకుంటున్న మొత్తాన్ని కాస్త తగ్గించి, ఆ స్థానంలో పప్పుదినుసులు, గుడ్డు, సోయా నగ్గెట్స్, ఆకుకూరల వినియోగం పెంచాలి. మీ ఆహారంలో ఒక పూట తృణధాన్యాలు (జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు) వాడటం మొదలుపెట్టండి. మరోపూట పూర్తిగా పప్పుదినుసులతో మాత్రమే చేసిన పదార్థాలను (పెసరట్టు, అడై, గుగ్గిళ్లు లాంటివి) తీసుకోండి. ఇలా మూడు నెలలపాటు చేస్తే మీ పొట్ట తగ్గుతుంది.

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా... మరిన్ని కఠిన చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.