ETV Bharat / state

ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణానికి వేగంగా అడుగులు

తెలంగాణ మణిహారం... ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటి వరకు ప్రకటనలకే పరిమితమైన ప్రాజెక్టుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 750 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధులతో ఉత్తర భాగంలో భూసేకరణ వేగంగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రహదారితో రాష్ట్రం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణానికి వేగంగా అడుగులు
ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణానికి వేగంగా అడుగులు
author img

By

Published : Mar 23, 2021, 4:11 AM IST

Updated : Mar 23, 2021, 6:39 AM IST

ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణానికి వేగంగా అడుగులు

హైదరాబాద్‌లో రోజురోజుకి జనాభా పెరిగిపోతుంది. ఫలితంగా రోడ్లపై ట్రాఫిక్ కూడా భారీగా పెరిగిపోతుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లో కోటికి పైగా నివసిస్తున్నారు. ఐదారేళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగిపోయే అవకాశాలున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలని... ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ అంతర్‌ వలయ రహదారి నిర్మించింది. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించింది. వీటిపైనా ట్రాఫిక్ భారీగా పెరిగిపోతుంది. అందుకే ప్రభుత్వం ప్రాంతీయ వలయ రహదారి నిర్మించేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. రెండు జాతీయ రహదారుల కింద రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలని భారత ప్రభుత్వానికి తెలిపింది.

భూసేకరణకే 3నుంచి 4కోట్ల వ్యయం

ప్రాంతీయ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి-నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-చౌటుప్పల్‌ వరకు నిర్ణయించి 161-ఏఏగా జాతీయ రహదారి నంబరును కేంద్రం కేటాయించింది. ఈ మార్గం 158 కిలోమీటర్లు. దక్షిణ భాగంగా ఉన్న చౌటుప్పల్‌-షాద్‌నగర్‌-సంగారెడ్డి వరకు 182 కిలోమీటర్లకు కూడా అనుమతి ఇచ్చేందుకు కేంద్రం ఇటీవల సుముఖత వ్యక్తం చేసింది. ప్రాంతీయ రింగు రోడ్డును భారతమాల-1 పనుల జాబితాలోనూ చేర్చింది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 100మీటర్ల వెడల్పుతో అంటే సుమారు 330అడుగుల వెడల్పుతో భూసేకరణ చేయాలని చూస్తున్నారు. ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణం దాదాపు 340 కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి కిలోమీటరుకు 70హెక్టార్ల భూమి అవసరం ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణకే సుమారు 3-4 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అధికారులు అంచనావేస్తున్నారు.

ఎక్స్​ప్రెస్ వే మాదిరిగా నిర్మాణం చేయాలని..

ఇక పూర్తి స్థాయి ప్రాజెక్టు వ్యయం సుమారు 13-14వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని భావిస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్డును ఎక్స్​ప్రెస్ వే మాదిరిగా నిర్మాణం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సుమారు 8 లైన్ల వరకు భూసేకరణ చేయాలని చూస్తోంది. ముందుగా 4 లైన్ల నిర్మాణం చేపట్టి... ట్రాఫిక్ పెరిగే కొద్దీ అంటే సుమారు 10ఏళ్ల తర్వాత మరో 8 లైన్లకు అభివృద్ధి చేయాలని భావిస్తోంది. హైదరాబాద్ నుంచి 12 ప్రధాన రహదారులు వివిధ ప్రాంతాలకు వెళుతుంటాయి. అందులో రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు, జిల్లా దారులు కలిసి ఉన్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వస్తే ఇవన్నీ అనుసంధానమవుతాయి.

త్వరలోనే పట్టాలెక్కనున్న నిర్మాణం

రీజినల్​ రింగ్​ రోడ్డు నిర్మాణం జరిగితే ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఓఆర్ఆర్​కు, రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యన భవిష్యత్​లో అనేక పరిశ్రమలు, లాజిస్టిక్ పార్కులు వస్తాయి. ఫ్యాబ్ సిటీ, ఫార్మాసిటీ బాహ్య వలయ రహదారి, ప్రాంతీయ వలయ రహదారుల మధ్యలో వస్తాయని అధికారులు అంటున్నారు. రీజినల్​ రింగ్​ రోడ్డు ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వేకి రంగం సిద్ధం చేసింది. బెంగళూరుకు చెందిన కన్సల్టెన్సీ సర్వే పనులను చేపట్టనుంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రీజినల్ రింగ్ రోడ్డుకు కావాల్సిన భూసేకరణ కసరత్తు ప్రారంభించనుంది. నిర్మాణానికి సంబంధించి జాతీయ రహదారుల విభాగం గతంలో కేంద్రానికి ప్రాథమిక అలైన్‌మెంట్‌ను సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం. గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా ఏయే ప్రాంతాల నుంచి ఈ రహదారి నిర్మాణం జరగనుందో ప్రణాళిక రూపొందించింది. ఇప్పుడు ఆ దారిలో భాగంగా ఏయే సర్వే నంబర్‌ భూముల నుంచి రోడ్డు నిర్మాణం జరగనుందో క్షేత్రస్థాయిలో పర్యటించి మార్కింగ్‌ చేయనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: పాఠశాలల కొనసాగింపుపై ప్రభుత్వం తర్జన భర్జన

Last Updated : Mar 23, 2021, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.