ETV Bharat / state

Crop Loss: ఆరుగాలం కష్టం వరదపాలైంది.. ఆదుకోకపోతే ఆగమవటం ఖాయం - telangana latest news

crop loss in telangana: అకాల వర్షాలు అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీశాయి. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలకు నేలకొరిగిన పంటలను చూసి రైతులు... ఆవేదన చెందుతున్నారు. చేతికందిన పంట చేజారిపోయిందని గోడు వెళ్లబోసుకుంటున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెడితే ఆరుగాలం కష్టం వరదపాలైందని... ప్రభుత్వం ఆదుకోకపోతే ఆగమవటం ఖాయమని ఆందోళన చెందుతున్నారు.

crop loss in telangana
అకాల వర్షం.. అన్నదాతలకు నష్టం..
author img

By

Published : Apr 28, 2023, 7:43 PM IST

crop loss in telangana: వర్షాలు, వడగళ్ల వానలు రాష్ట్రంలో రైతులకు కడగండ్లు మిగిల్చాయి. నిన్నటివరకూ ఏపుగా పెరిగి కళకళలాడిన వరి... ఈదురుగాలులు, రాళ్ల వానలతో... గింజన్నదే లేకుండా పోయింది. చేలన్నీ చేతికందకుండా పోయాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన వడగళ్ల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది.

ఖర్చులు సైతం దక్కవు: కుండపోత వానతో ఉద్యాన, వ్యవసాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం మండలాల్లో మామిడి, బొప్పాయి, అరటి, పుచ్చకాయ, మొక్కజొన్న, టమాట, బెండ, వంగ పంటలు దెబ్బతిన్నాయి. రాళ్ల దెబ్బలకు మామిడి రంగు మారిందని మార్కెట్లో కొనడం కష్టమేనని కర్షకులు ఆవేదన చెందుతున్నారు. కోతకు వచ్చిన బొప్పాయి చెట్లు విరిగిపోయాయి. అరటి తోటలు నేలవాలిపోవడం వల్ల పెట్టుబడి ఖర్చులు సైతం దక్కవని అన్నదాతలు వాపోతున్నారు.

ఆరబోసిన ధాన్యం తడిసి ముద్ద: జగిత్యాల జిల్లాలో అధిక వర్షాలు అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తుంది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల మామిడి మార్కెట్‌లో ధరలు పతనమై రైతులు దిగాలు చెందుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మద్దతు ధర సైతం దక్కడం లేదని వాపోతున్నారు. జిల్లాలో 38 వేల ఎకరాల్లో సాగు చేయగా ఏటా 50 వేల టన్నుల దిగుబడి వచ్చేది ఈ ఏడు సగానికి సగం తగ్గిపోయి నష్టం వాటిల్లింది. నల్లటి మచ్చలు రావటంతో కాయ నాణ్యత బాగా తగ్గిపోయింది. భారీగా తగ్గిన ధరలతో కనీసం పెట్టుబడి కూడా రావటంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దెబ్బతిన్న పంటలను పట్టించుకునే దిక్కులేదు: నిజామాబాద్ జిల్లా తిర్మాన్ పల్లి, కొండూర్ రైతులు ఆందోళన చేపట్టారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పట్టించుకునే దిక్కులేదని వాపోతున్నారు. ప్రభుత్వమే పెద్దమనసుతో తడిసిన పంట కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ సొసైటీ ఎదుట రోడ్డుపై రైతుల ధర్నా చేపట్టారు. తడిసిన ధాన్యానికి ఎలాంటి కడ్త లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని నినదించారు. నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి అధికారులు చేతులు దులుపుంకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పార్టీలు: రాష్ట్రంలో వ్యవసాయ అత్యవసర పరిస్థితి ప్రకటించి, అన్నదాతలను అన్ని విధాల ఆదుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కొన్నిరోజులుగా పడుతున్నవడగళ్లు, అకాల వర్షాలతో పంటలు, పండ్ల తోటలు భారీగా దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞిప్తి చేసింది. కేంద్ర ఆర్థిక సంఘం ప్రకృతి వైపరీత్యాలను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి పదహారు వందల కోట్లు ఇచ్చినా... ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరికి సాయం అందించలేదని కాంగ్రెస్‌ నేతలు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, కోదండరెడ్డి, ప్రసాద్‌కుమార్‌ విమర్శించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్‌లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ కాంగ్రెస్‌ నేతలు రాస్తారోకో చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను భాజపా నాయకులు పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత అన్నదాతలకు తక్షణం పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మూడు రోజులపాటు వర్షాలు: మూడు రోజులపాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల సగటు కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.