ETV Bharat / state

Farmers debts: అరకొర దిగుబడులు, రుణాలతో తీరని రైతన్న వెతలు

Farmers debts: అప్పుల ఊబిలో చిక్కుకుని రైతులు ఉసురుతీసుకుంటున్నారు. పంటల దిగుబడి సరిగా రాక, గిట్టుబాటు ధర లభించక.. రైతులు కోలుకోలేని స్థితికి చేరుతున్నారు. తెచ్చిన రుణాల నుంచి గట్టెక్కే దారిలేక మెడకు ఉరి బిగించుకుంటున్నారు.

author img

By

Published : Mar 15, 2022, 6:02 AM IST

Farmers
Farmers

Farmers debts: సాగు నష్టాల సాక్షిగా అప్పుల ఊబిలో చిక్కుకుని రైతులు ఉసురుతీసుకుంటున్నారు. మిరప, పత్తి వంటి పంటల దిగుబడి సరిగా రాక, గిట్టుబాటు ధర లభించక.. రైతులు కోలుకోలేని స్థితికి చేరుతున్నారు. తెచ్చిన రుణాల నుంచి గట్టెక్కే దారిలేక మెడకు ఉరి బిగించుకుంటున్నారు. ఈనెల 12, 13 తేదీల్లో మహబూబాబాద్‌ జిల్లాలో మానవహక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదికలకు చెందిన ఎనిమిది మంది సభ్యుల బృందం కేసముద్రం, మహబూబాబాద్‌, దంతాలపల్లి, మరిపెడ మండలాలను సందర్శించింది. ఆత్మహత్య చేసుకున్న పన్నెండు మంది రైతులకు చెందిన కుటుంబాలను కలిసి వివరాలు సేకరించింది. వ్యవసాయ అధికారులతో మాట్లాడింది. రైతుల ఆత్మహత్యల విషయంలో సేకరించిన సమాచారాన్ని ఈ రెండు సంఘాల ప్రతినిధులు విస్సా కిరణ్‌కుమార్‌, కొండల్‌లు తాజాగా మీడియాకు విడుదల చేశారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు.

* నెల్లికుదురు, డోర్నకల్‌ మండలాల్లో ముగ్గురేసి.. దంతాలపల్లి, మరిపెడ మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందరికీ రూ.6 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు అప్పులున్నాయి.

రూ.3లక్షల అప్పు ఏడింతలు కావడంతో...

మహబూబాబాద్‌ మండలం అమ్మనగల్‌కు చెందిన దేవిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం సిండికేట్‌ బ్యాంక్‌లో 15 ఏళ్ల క్రితం తీసుకున్న రూ.3లక్షల అప్పు వడ్డీ సహా ఏకంగా రూ.20 లక్షలకు చేరింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన వెంకటరెడ్డి ముగ్గురు ఆడపిల్లలను అనాథలను చేసి పంట చేలోనే గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

రైతు బీమా పరిహారమూ రాలే..

మహబూబాబాద్‌ మండలం, పర్వతగిరి గ్రామం దళిత కుటుంబానికి చెందిన నారమల్ల సంపత్‌(25) తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. రుణంతో ట్రాక్టర్‌ తీసుకొన్నారు. తండ్రికున్న కాస్త భూమికి అదనంగా మరింత కౌలుకు తీసుకుని ఇద్దరూ వ్యవసాయం చేసేవారు. వరుసగా దెబ్బతిన్న పంటలను చూసి తట్టుకోలేక చేనులోనే పురుగుమందు తాగి సంపత్‌ చనిపోయాడు. అతని పేరు మీద ఏమాత్రం భూమి లేనందున రైతు బీమా పరిహారమూ వచ్చే పరిస్థితి లేదు. భార్య, చిన్నారులైన ఇద్దరు ఆడపిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

అప్పులోళ్ల వేధింపులు...

మృతుల కుటుంబాలపై ఉన్న బ్యాంకు, ప్రైవేటు అప్పులన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. అప్పులవాళ్ళంతా కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు. రుణాలను మాఫీ లేదా సెటిల్‌ చేయటానికి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు. మృతుల్లో కొందరికి ఇప్పటివరకు రైతు బీమా పరిహారం అందింది. వెంకటగిరిలోని భూక్యా వెంకన్నను బతికించుకోవడానికి చేసిన విఫల ప్రయత్నంలో ఆసుపత్రి ఖర్చులకు కొత్తగా చేసిన అప్పు కింద రైతుబీమా పరిహారంలో సగం పోయింది. ఇనుగుర్తి గ్రామానికి చెందిన వొల్లం వెంకన్న, తారాసింగ్‌ తండా రాంలాల్‌ శ్రీనులకు రైతు బీమా అందాల్సి ఉంది. వెంకన్నకు అప్పిచ్చిన వాళ్లు వెంటనే తీర్చాలని గొడవ చేస్తున్నారు.

* మృతుల కుటుంబాలు భవిష్యత్తులో నిలదొక్కుకోవడం కష్టంగానే ఉంది. అప్పులను వన్‌ టైం సెటిల్మెంట్‌ పరిధిలోకి తెచ్చి మృతుల కుటుంబాలను అప్పులవాళ్ల వేధింపుల నుంచి రక్షించాలని ఈ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. కౌలురైతులను కూడా వాస్తవ సాగుదారులుగా గుర్తించే చట్టం చేసి, రైతులకిస్తున్న ప్రతి సహాయాన్నీ వారికి సైతం వర్తింపజేయాలని సూచించాయి.

ఇదీ చదవండి:మీరు చేసిన తప్పులను సరిదిద్దడం తప్పా?: మంత్రి హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.