ETV Bharat / state

కార్యాలయాలకు తాళం... ఉద్యోగులు మాయం - తెలంగాణ వ్యవసాయ వార్తలు

రైతు శిక్షణ కేంద్రాలలో రైతులకు ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించకుండా సిబ్బంది ఖాళీగా కూర్చుని నెలనెలా రూ.లక్షల వేతనాలు తీసుకుంటున్నారు. పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ కేంద్రాలున్నాయి. ఆదిలాబాద్‌లో పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్న ఓ ఏడీని తీసుకొచ్చి ఈ కేంద్రంలో నియమించడంతో ఖాళీగా కూర్చుని జీతం తీసుకుంటున్నాడు. ఆయనపై విచారణను పక్కన పెట్టేసి ఇలా కాపాడుతున్నారన్న ఆరోపణలున్నాయి.

తెరుచుకోని  రైతు శిక్షణ కేంద్రాలు... కానరాని అధికారులు

author img

By

Published : Mar 6, 2021, 6:59 AM IST

కరీంనగర్‌ రైతు శిక్షణ కేంద్రంలో ఇద్దరు సహాయ సంచాలకులు (ఏడీ), ఇద్దరు వ్యవసాయాధికారులు, సీనియర్‌ అసిస్టెంటు, జూనియర్‌ అసిస్టెంటు, ఒక అటెండర్‌ ఉన్నారు. ఏడాదిన్నర నుంచి వీరంతా ఖాళీగా కూర్చుంటున్నారు. నిధులేమీ లేనందున రైతులకు ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం లేదని ‘ఈనాడు’కు అక్కడి ఉద్యోగి చెప్పారు. ఆదిలాబాద్‌లో పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్న ఓ ఏడీని తీసుకొచ్చి ఈ కేంద్రంలో నియమించడంతో ఖాళీగా కూర్చుని జీతం తీసుకుంటున్నాడు. ఆయనపై విచారణను పక్కన పెట్టేసి ఇలా కాపాడుతున్నారన్న ఆరోపణలున్నాయి.

ఖమ్మంలో ఉప సంచాలకుడు (డీడీ), ఇద్దరు ఏడీలు, ఆరుగురు ఏఓలు, సీనియర్‌ అసిస్టెంటు, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు ఉన్నారు. వీరూ లక్షలాది రూపాయల జీతం పొందుతున్నారు. మరోవైపు జగిత్యాల జిల్లాలో ఏడు ఏఓ పోస్టులు ఖాళీగా ఉండటంతో రైతులకు సేవలు అందడం లేదు. అక్కడ రైతులకు పనులు చేయాల్సిన సిబ్బంది లేరని పోస్టులు ఖాళీగా ఉంచారు. రైతు శిక్షణ కేంద్రంలో అధికారులు తమకు పనులు లేవని ఖాళీగా కూర్చుంటున్నారు. పంటల సాగుపై రైతులకు ఎప్పటికప్పుడు శిక్షణ కార్యక్రమాలను ఈ కేంద్రాలు నిర్వహించాలి. కేంద్ర, రాష్ట్ర పథకాల గురించి రైతులకు వివరించాలి. కానీ క్షేత్రస్థాయిలో అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. విస్తరణ, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిన రైతు శిక్షణ కేంద్రాల సిబ్బంది తమకు అసలు పని లేదని కార్యాలయాలకే రావడం లేదు. వచ్చినా రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి వ్యవసాయశాఖ గత ఏడాదిన్నరగా నిధులేమీ విడుదల చేయలేదని చెపుతున్నారు.

రైతువేదికలకు మారిస్తే సరి...

రైతులకు శిక్షణ, పథకాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఐదారు గ్రామాలకు పక్కాగా రైతువేదికలను ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్మించింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో నిరుపయోగంగా ఉన్న రైతు శిక్షణ కేంద్రాలను రద్దు చేసి అక్కడి సిబ్బందిని వెంటనే రైతువేదికల్లో నియమిస్తే బాగుంటుందని సీనియర్‌ వ్యవసాయాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. రైతులకు దూరంగా జిల్లా కేంద్రాల్లో వ్యవసాయాధికారులు ఎందుకని జిల్లా వ్యవసాయాధికారులే ప్రశ్నిస్తున్నారు.

అవినీతి సిబ్బందికి అడ్డాలుగా...

వ్యవసాయశాఖలో ఎక్కడైనా నిధులు దుర్వినియోగం చేసి అవినీతి, అక్రమాలకు పాల్పడిన సిబ్బందిని అక్కడి నుంచి బదిలీ చేయడానికి ఈ రైతు శిక్షణ కేంద్రాలను వాడుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో ఏఓ, ఏడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 జిల్లాలకు శాశ్వత వ్యవసాయాధికారులు లేక ఇంఛార్జులతో నెట్టుకొస్తున్నారు. డీడీ స్థాయి అధికారులు లేరని పలు జిల్లాల వ్యవసాయాధికారులుగా ఏడీలనే ఇంఛార్జులుగా పెట్టి పనిచేయిస్తున్నారు. మరి రైతు శిక్షణ కేంద్రాల్లో డీడీ స్థాయి అధికారులను ఖాళీగా కూర్చోబెట్టి జీతాలెందుకిస్తున్నారు? వారినే ఖాళీ పోస్టులున్న జిల్లా వ్యవసాయాధికారులుగా ఎందుకు నియమించడం లేదనే ప్రశ్నకు జవాబు లేదు. ఖాళీగా కూర్చుంటున్న సిబ్బందిని పోస్టులు ఖాళీగా ఉన్న మండలాలకు ఎందుకు పంపడం లేదో అర్థం కావడం లేదని ఓ జిల్లా వ్యవసాయాధికారి ‘ఈనాడు’తో వాపోయారు.

ఇదీ చూడండి: గతేడాది హైదరాబాద్‌ వరదలపై నీతి ఆయోగ్‌ నివేదిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.