ETV Bharat / state

Farmer suicides have dropped in telangana: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేవట!

author img

By

Published : Sep 23, 2021, 10:15 AM IST

కలెక్టర్లకు లేఖలో వ్యవసాయశాఖ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు దాదాపు పూర్తిగా తగ్గిపోయాయని(Farmer suicides have dropped) వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌, రైతుబంధు, సాగునీటి పథకాలు, మద్దతు ధరలకు పంటల కొనుగోలు, సాగుకు అవసరమైనవన్నీ సరఫరా చేయడం వంటి కార్యక్రమాలతో (farmer welfare schemes in telangana) రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రాసిన లేఖలో తెలిపారు.

Farmer suicides
Farmer suicides

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయని (farmers Suicides in Telangana) వ్యవశాయశాఖ పేర్కొంది. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో(farmer welfare schemes in telangana) ఆత్మహత్యలు తగ్గాయని(Farmer suicides have dropped) వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్​రావు... అన్ని జిల్లాల కలెక్టర్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఎందుకీ లేఖ...

రైతు ఆత్యహత్య చేసుకుంటే అతని కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. రైతు నిజంగా అప్పుల బాధతోనే, పంటల సాగులో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడా అని విచారణ చేయడానికి ప్రతి జిల్లాలో ‘త్రిసభ్య విచారణ కమిటీ’ని నియమించాలని రెవెన్యూశాఖ గతంలో ఉత్తర్వులిచ్చింది. వ్యవసాయాధికారి, రెవెన్యూ అధికారి, స్థానిక పోలీసు అధికారి సభ్యులుగా ఉండాలని తెలిపింది. కానీ రైతుబీమా పథకం అమల్లోకి వచ్చాక గత మూడేళ్లుగా ఈ పరిహారం ఇవ్వడాన్ని ఆపివేసింది.

రైతుల ఆత్మహత్యల వివరాలను ప్రభుత్వశాఖలేవీ అధికారికంగా ప్రకటించడం లేదు. ఆ వార్తలు ప్రసార మాధ్యమాల్లో వచ్చినా అధికారులు నిర్ధారించడం లేదు. ఈ నేపథ్యంలో... ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయాయని, ఎక్కడైనా అరుదుగా బలవన్మరణం జరిగితేనే జిల్లా వ్యవసాయాధికారిని త్రిసభ్య కమిటీలో సభ్యుడిగా నియమించాలని కలెక్టర్లకు వ్యవసాయశాఖ సూచించింది. కాగా, ఇప్పటికీ పంటలు దెబ్బతిని నష్టాలతో అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి.

దేశంలో పరిస్థితి ఏంటి..?

దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలను ఈ ఏడాది అందించడం వీలుకాదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు(యూటీ).. రైతుల బలవన్మరణానికి పాల్పడిన వివరాలను ఇప్పటివరకు తమ దృష్టకి తీసుకురాకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎలాంటి వివరాలు లేవు..

నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో(ఎన్​సీఆర్బీ)​ ప్రకారం.. ఆయా రాష్ట్రాలు, యూటీలు.. రైతులు, కూలీల ఆత్మహత్యల సమాచారం 'నిల్(ఏమీ లేనట్లు)​'గా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. కేవలం రైతులు కాకుండా.. ఎలాంటి మృతుల వివరాలు అందులో పొందుపరచలేదన్నారు. ఫలితంగా వ్యవసాయ రంగంలో.. దేశవ్యాప్త రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను ఇచ్చేందుకు సాధ్యపడదని రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు కిషన్​ రెడ్డి.

'ఎన్​సీఆర్బీ' లెక్కలివే..

ప్రమాదవశాత్తు సంభవించిన మరణాలు, ఆత్మహత్యలపై.. ఎన్​సీఆర్బీ తాజా గణాంకాలను విడుదల చేసింది. 2018లో 10,357 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడగా.. 2019లో ఆ సంఖ్య 10,281కి తగ్గింది. వీరిలో 5,957 మంది రైతులు, 4,324 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. వ్యవసాయరంగంలో ఆత్మహత్య రేటును దేశంతో పోల్చగా 7.4 శాతం ఉంది.

ఇదీ చూడండి: 'రైతుల ఆత్మహత్యల వివరాలు ఇచ్చేందుకు వీలుకాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.