ETV Bharat / state

Farmer Suicides in Telangana: 'వెంటాడుతున్న రుణపాశం.. సాయం చేయని ప్రభుత్వం' - రైతుల ఆత్మహత్య

Farmer Suicides in Telangana: పంటలు చేతికి రాక.. చేసిన అప్పులు తీర్చలేక ఆ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం మొండి చేయి చూపిస్తోంది. తమ వారిని కోల్పోయి ఏళ్లు గడుస్తున్నా.. రుణపాశం ఇంకా వెంటాడుతూనే ఉందని.. ఇప్పటికీ ప్రభుత్వ సాయమూ అందలేదని ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమను ఆదుకునే వారు రాకపోతారా అని ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాయి.

Farmer Suicides in Telangana
రైతుల కుటుంబాలు
author img

By

Published : Dec 17, 2021, 8:23 AM IST

Farmer Suicides in Telangana: ఒక రజిత, ఓ శ్రీలత, ఒక మౌనిక, ఇందిర, లత, వనిత, నీల, మానస, గీత.. ఇలా పట్టుమని నలభై ఏళ్లు కూడా లేని ఎంతో మంది మహిళల భర్తలను ప్రైవేటు పంట రుణాలు కబళించాయి. జీవిత భాగస్వామిని, కుటుంబ యజమానిని పోగొట్టుకుని తీరని బాధతో ఉన్న ఆ కుటుంబాలను అప్పుల ఒత్తిడి.. ఎలా నిలదొక్కుకోవాలనే ఆవేదన సతమతం చేస్తున్నాయి. ఇప్పటికీ తమకు ఏ ఆసరా దొరకలేదని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. జీవో 194 కింద రైతు ఆత్మహత్యకు అందాల్సిన పరిహారం నేటికీ రాలేదని కొందరు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల.. కుటుంబాలు గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సమావేశమయ్యాయి. వారిలో కొందరి గాథలివీ!

డిసెంబరు 31 రాత్రి..

కుమారుడితో కుర్వ మంజుల

చ్చీరాని మాటలతో నాన్న అని పలుకుతూ తండ్రి చిత్రపటాన్ని తడుముతున్న చిన్నారిని ఎత్తుకున్న ఈ తల్లి పేరు కుర్వ మంజుల. వీరిది వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం తొండపల్లి. 7, 5, 2 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలకు తల్లి ఆమె. గత ఏడాది డిసెంబరు 31 రాత్రి ఆమె భర్త రవీందర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘ఏటికేడు పెరిగిన రూ.4.50 లక్షల అప్పు బాధ తట్టుకోలేక నా భర్త పురుగుల మందు తాగి కన్నుమూశారు. ఇప్పటికీ అప్పుల బెడద పోలేదు. ముగ్గురు పిల్లల కోసం నేనే పలుగు పట్టా. ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదు. మా నాన్న నన్ను ఏడో తరగతే చదివించి 15 ఏళ్లకు పెళ్లి చేశాడు. అయినా, నాకు ఆసరా ఇస్తే నిలదొక్కుకుంటా’’ అని మంజుల తెలిపారు.

భర్తని, కుమారుడిని కోల్పోయి.. పరిహారం అందక

ఒకరి తర్వాత ఒకరు

మె పేరు పద్మమ్మ. వీరిది వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం మాదారం. ‘‘మూడేళ్లు వరుసగా పంటల దిగుబడి సరిగా రాకపోవడం, బోరు బావి ఎండిపోవడంతో మాకు కష్టాలు మొదలయ్యాయి. పంటల కోసం చేసిన అప్పులు రూ.6 లక్షలు కట్టలేని స్థితిలో నా భర్త బండయ్య 2018 జూన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరిహారం కోసం పెద్ద కుమారుడు నరేష్‌ అధికారుల చుట్టూ తిరగడంతో గతేడాది మంజూరైనా.. బడ్జెట్‌ లేదని ఇవ్వలేదు. మరోవైపు అప్పుల వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక నరేష్‌ కూడా గతేడాది ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికీ పరిహారం అందలేదు. మానసిక స్థితి సరిగాలేని చిన్నకొడుకుని సాకుతూ.. కూలీ చేసి బతుకుతున్నా’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కాళేశ్వరం వెనుక జలాలు ముంచేశాయి

నీళ్లే ముంచేశాయి

‘‘నా తమ్ముడు రాజేశ్‌ పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరుసగా రెండేళ్లు మిర్చి, పత్తి సాగు చేశారు. ఆ రెండేళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ జలాశయం వెనుక జలాలు పంటలను ముంచేశాయి. రూ.8 లక్షల అప్పు మిగిలింది. ఇది తట్టుకోలేక ఈ ఏడాది సెప్టెంబరులో రాజేశ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటికి పెళ్లై రెండేళ్లే అవుతోంది. ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన కమ్మల అంజన్న.

బీమాకు దూరం చేసిన రెండు ఖాతాలు

ప్రాణం పోయినా బీమా అందలేదు

‘నా భర్త రాజయ్య రూ.7 లక్షల అప్పుల భారంతో 2018 ఆగస్టులో ఊపిరి తీసుకున్నారు. ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు. మరోవైపు ఒకే పొలానికి రెండు ఖాతాలతో పాసుపుస్తకాలు జారీ చేసి వాటిని తిరిగి తీసుకున్నారు. దీంతో రైతు బీమా కూడా అందలేదు’ అని వాపోయారు జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్‌కు చెందిన మహిళా రైతు రమ. ‘ఆయన పోయాక పిల్లల పేర్లపై చెరి మూడు ఎకరాలకు పట్టాపాసుపుస్తకాలు ఇచ్చారు. ఇంకా ఒక ఎకరా భూమిని పట్టా చేయలేదు. ప్రభుత్వం రైతు ఆత్మహత్యకు పరిహారం ఇప్పటికీ మంజూరు చేయలేదు’ అని ఆమె వివరించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.