ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరితో నీళ్లు, నిధులు ఆంధ్ర పాలవుతున్నాయని, నియామకాలు కేసీఆర్ కుటుంబానికి పరిమితం అయ్యాయని మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. దక్షిణ తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.
2005లో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11వేల క్యూసెక్కుల నుంచి 44వేలకు పెంచినప్పుడు కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదు. ఇప్పుడు మొత్తం 14 తూముల ద్వారా సుమారు 70వేల క్యూసెక్కులు నీటిని తీసుకెళ్లుతున్నారు. కృష్ణ బేసిన్ నీటిని తరలిస్తుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు. దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. వెంటనే పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రి-మీటర్లు ఏర్పాటు చేయాలి.
-వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ నేత
ఇదీ చూడండి: ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయం ప్రారంభం: హరీశ్