ETV Bharat / state

గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులపై పడిన ఫ్యాన్​ - కొవిడ్​ బాధితుల తాజా వార్తలు

తెలంగాణలో కరోనా కలవరపెడుతోంది. బాధితులకు చికిత్స కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. రోగులందరూ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కొవిడ్​తో పోరాడుతూ.. బతుకుతామో లేదో అని ఆందోళనలో ఉన్నారు రోగులు. అయితే ఈ సమయంలో వారికి ఫ్యాన్​ గండం ఎదురైంది.

చికిత్స పొందుతున్న కరోనా బాధితులపై పడిన ఫ్యాన్​

author img

By

Published : Jun 2, 2020, 2:30 PM IST

చికిత్స పొందుతున్న కరోనా బాధితులపై పడిన ఫ్యాన్​

మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది కరోనా బాధితుల పరిస్థితి. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ఏడో అంతస్తులో కరోనా పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం ఉదయం పైకప్పుకు ఉన్న ఫ్యాన్​ ప్రమాదవశాత్తు రోగులపై పడింది. దీంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

విషయం తెలిసిన సిబ్బంది చాలా సేపటి వరకు రాలేదు. అసలే ప్రాణాలతో పోరాడుతున్నామని.. ఈ సమయంలో ఇలా జరిగితే బాధ్యులు ఎవరంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: 'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.