Challagulla Narasimha Rao: తెలుగునాట ఆలోచలను కాస్తంత విస్తరింపజేసే వ్యక్తి మన మధ్య నుంచి వెళ్లిపోతే సమాజానికి తీరని నష్టమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. తెలుగు సమాజానికి వెలుగునిచ్చిన పాత్రికేయులు, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు చల్లగుళ్ల నరసింహారావుకు కుటుంబసభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఘన నివాళులర్పించారు. ఈనెల 12న కన్నుమూసిన నరసింహారావు సంతాపసభను హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించారు. సంతాపసభకు ఆయన మిత్రులు, సహచర పాత్రికేయులు, శ్రేయోభిలాషులు హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతో ఉన్న తమ అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
పలువురు ప్రముఖులు చల్లగుళ్ల నరసింహారావుతో ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకాలతో రేపటి మనిషి పేరుతో రూపొందించిన సంకలనాన్ని ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ నాగేశ్వర్‌రావుతో కలిసి పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. భిన్న ఆలోచనలతోనే సమాజంలో మార్పు తీసుకురాగలమని నమ్మిన వ్యక్తి చల్లగుళ్ల నరసింహారావు అని నాగేశ్వర్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మండలి మాజీ ఛైర్మన్ బుద్ద ప్రసాద్, పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు, సృజన చౌదరి, మాజీ పార్లమెంట్ సభ్యులు వడ్డే శోభనాద్రీశ్వర్‌రావు, ఎలమంచిలి శివాజీ, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరావు, లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కనీసం మరో పదిహేనేళ్ల పాటు తెలుగునాట ఆలోచలను కాస్తంత విస్తరింపజేసే వ్యక్తి మన మధ్య నుంచి వెళ్లిపోతే వ్యక్తిగతంగా స్నేహం, ఆప్యాయత పొందిన మనకే కాకుండా సమాజానికి బోలెడంత నష్టం. నరసింహరావు లాంటి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. -- జయప్రకాశ్ నారాయణ, లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు
నరసింహరావులాంటి నిర్భితి గల జర్నలిస్ట్‌ను సమకాలీన సమాజంలో నేనైతే ఎక్కడా చూడలేదు. చాలా ధైర్యశాలి. ఆయన చాలా టీవీ డిబెట్లలో మాట్లాడినప్పుడు మాకు భయం వేసేది. ఎందుకంటే ఎలాంటి విషయమైనా నిక్కచ్చిగా మాట్లాడేవారు. అదే విషయం అడిగితే... బూడిద వాళ్లేం చేస్తారు అని అనేవారు. ఆయన ఒరిజినల్ థింకర్. వ్యక్తిత్వ వికాసంలో ఉండే మౌలిక సూత్రం అది. మీరు భిన్నంగా ఆలోచించాలి. అప్పుడు మాత్రమే మనం సమాజంలో మార్పు తీసుకురాగలమని చెప్పేవారు. ఇది విషయాన్ని నమ్మి, ఆచరించి.. అదే విధంగా ఉన్న వ్యక్తి నరసింహరావు. -- ఎం నాగేశ్వరరావు, ఈనాడు ఎడిటర్
రాజకీయ నాయకుల మనో విశ్లేషణ రాసినప్పుడు దానికి ఎంతో ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఆ పార్టీల వారు నిరసన వ్యక్తం చేయొచ్చు. లేదా అభిమానులు చేయొచ్చు. కుటుంబ సభ్యులు చేయొచ్చు. కానీ ఎక్కడా కూడా అదురుబెదురు లేకుండా... వారు మానసికి విశ్లేషణలు రాయడం సామాన్యమైన విషయం కాదు. ఎంతో గుండెబలం ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలరు. అలాంటి గుండె బలం ఉన్న వ్యక్తి నరసింహరావు. -- బుద్ధప్రసాద్, ఏపీ మాజీ ఉపసభాపతి
CM KCR Distributed Cheques: 'పంజాబ్ రైతుల పోరాట స్ఫూర్తికి సలాం'