ETV Bharat / state

ఉపవాసం చేస్తున్నారా...? అయితే ఇది తెలుసుకోండి!!

మీరు కానీ... మీ ఇంట్లో వాళ్లు కానీ ఉపవాసం పాటిస్తున్నారా? అసలు ఉపవాసం ఎంతవరకు మంచింది? ఏ వయస్సులో చేస్తే బాగుంటుంది? దీనితో కలిగే నష్టాలు ఏమైనా ఉన్నాయా? మన శరీరానికి ఉపవాసం ఎంతవరకు మంచిదో తెలుసుకుందాం.

facts about fasting
ఉపవాసం చేస్తున్నారా...? అయితే ఇది తెలుసుకోండి!!
author img

By

Published : Dec 25, 2019, 10:29 AM IST

మా అమ్మ వయసు డెబ్బయి ఏళ్లు. ఎత్తు ఐదడుగుల రెండు అంగుళాలు. బరువు యాభై కిలోలు. ఈ మధ్యే తను ఐదు కిలోల బరువు తగ్గింది. తనకు మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యలు లేవు. రెండేళ్ల కిందట రొమ్ము క్యాన్సర్‌ వచ్చింది. చికిత్సలో భాగంగా రేడియేషన్‌, కీమో థెరపీలు చేయించుకుంది. తను ఎక్కువగా ఉపవాసాలు చేస్తోంది. ఇలా బరువు తగ్గడం మంచిదేనా? ఈ వయసులో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? - ఓ సోదరి

వృద్ధాప్యంలో కారణం లేకుండా బరువు తగ్గడం మంచిది కాదు. మీ ఉత్తరాన్ని బట్టి చూస్తే మీ అమ్మగారు సరైన పద్ధతిలో ఆహారం తీసుకోవడం లేదనిపిస్తోంది. చెప్పాలంటే ఆవిడ ఉండాల్సిన దానికంటే తక్కువ బరువున్నారు. సమతుల ఆహారం నిర్ణీత మొత్తంలో క్రమపద్ధతిలో తీసుకోకపోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కండరాల సాంద్రత తగ్గుతుంది. ఎముకలు బలహీనంగా మారి ఆస్టియోపొరోసిస్‌ సమస్యకు దారితీయొచ్చు. మజిల్‌ మాస్‌ తగ్గడాన్ని సార్కోపీనియా అంటారు.

ఆరోగ్యంగా ఉండాలంటే మొలకలు, పండ్లు, నట్స్‌... ఇలా ఏ రూపంలో ఎంత మంచి ఆహారం తీసుకున్నా... అవి ఆమె శరీర బరువు మోతాదుకు సరిపోయేలా తీసుకోవాలి. ఆమె సరైన మోతాదులో తీసుకోవడంలో లేదు. కారణం లేకుండా బరువు తగ్గుతున్నారంటే శరీరానికి సరిపోయే పోషకాలు అందడం లేదని అర్థం. ఈ వయసులోనూ మాంసకృత్తులు చాలా అవసరం. శాకాహారులైతే పాలు, పెరుగు, పప్పుదినుసులు, నట్స్‌ లాంటివి తీసుకోవాలి. ఆమె బరువును చూసుకుంటూ దానికి తగ్గట్లుగా ఆహారం తీసుకోవాలి.

ఆహారంలో సమతుల్యత లోపించినప్పుడు.. మాంసకృత్తులు తీసుకోనప్పుడు మజిల్‌ మాస్‌ తగ్గిపోతుంది. పనిచేసే శక్తి తగ్గిపోయి, నీరసం, అలసటా ఆవహిస్తాయి. ఎముకలు విరగడం లాంటి ప్రమాదాలకు గురవుతారు. ఉపవాసం చేయడం మంచిదే. ఒక పద్ధతి ప్రకారం చేయాలి.

- జానకీ శ్రీనాథ్‌, పోషకాహార నిపుణురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.