ETV Bharat / state

కరెంట్ మీటర్ రీడింగ్ ఇకపై ఎవరికి వారే తీసుకోవచ్చు.. - తెలంగాణ వార్తలు

కరెంట్ మీటర్ రీడింగ్ ఇకపై ఎవరికి వారే స్వయంగా తీసుకునే వెసులుబాటు త్వరలో అందుబాటులోకి రాబోతోంది. రీడింగ్‌తోపాటు ఆ బిల్లుకు నగదు చెల్లింపులు సైతం కేవలం నిమిషంలో అంతర్జాలంలోనే చేసేయవచ్చు. టీఎస్​ఎస్పీడీసీఎల్​ త్వరలోనే ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే టీఎస్​ఎస్పీడీసీఎల్​ తెచ్చిన యాప్‌ విజయవంతంగా నడుస్తోంది. ఇంతకీ సొంతంగా మీటర్ రీడింగ్ ఎలా చేయాలి...? బిల్లింగ్ ఎలా లెక్కగట్టాలి..? ఆ వివరాలు తెలుసుకుందాం.

current meter reading
కరెంట్ మీటర్ రీడింగ్ ఇకపై ఎవరికి వారే తీసుకోవచ్చు..
author img

By

Published : May 16, 2021, 2:26 AM IST

కరెంట్ మీటర్ రీడింగ్ ఇకపై ఎవరికి వారే తీసుకోవచ్చు..

మీ విద్యుత్ మీటర్‌లో ఎంత రీడింగ్ నమోదైంది..? దానికి చెల్లించాల్సిన బిల్లు వివరాలు ఇకపై మీరే స్వయంగా తెలుసుకోవచ్చు. టీఎస్​ఎస్పీడీసీఎల్​ సంస్థ ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇప్పటికే ఈ యాప్‌ను విద్యుత్ సాంకేతిక అధికారులు వినియోగిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్​ఎస్పీడీసీఎల్​ సంస్థ అధికారికంగా వెల్లడించనుంది. అసలే కరోనా కారణంగా మీటర్ రీడింగ్ చేసేవారు... ఇంటింటికి తిరిగి బిల్లింగ్ చేయడానికి సంకోచిస్తున్నారు. కరోనా మొదటి దశలో చాలా మంది మీటర్ రీడర్లు తీసే సిబ్బంది.. కొవిడ్ బారినపడ్డారు. రెండో దశలోనూ అదే సమస్య ఉత్పన్నమైంది. గతేడాది లాక్‌డౌన్ విధింపుతో ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన రెండు బిల్లులు ఒకేసారి తీయాల్సి వచ్చింది. ఈ కారణంగా చాలామంది వినియోగదారులు అనేక సందేహాలు, అనుమానాలు వెలిబుచ్చారు. కొందరికి బిల్లింగ్ ఎక్కువగా వచ్చిందని వాపోయారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్పీడీసీఎల్​ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మీటర్​ రీడింగ్​ తెలుసుకోవాలంటే..

మీ మీటర్ రీడింగ్‌ మీరే స్వయంగా తెలుసుకోవాలంటే టీఎస్​ఎస్పీడీసీఎల్​ సంస్థకు సంబంధించిన యాప్‌, భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్‌నూ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, విద్యుత్ మీటర్ యూఎస్​ఎన్​ నంబర్ ఎంటర్ చేయాలి. అందులో వినియోగదారుల సెల్ఫ్‌ బిల్లింగ్ ఆప్షన్ కన్పిస్తుంది. ఆ వెంటనే మీకు కే.డబ్ల్యూ.హెచ్ అనే స్కాన్ కనిపిస్తుంది. ఇది మీ ఫోన్ పే, గూగుల్ పే మాదిరిగా ఉండే స్కాన్‌లా కన్పిస్తుంది. దీన్ని స్కాన్ చేయగానే...అందులో మీటర్ రీడింగ్ ఫోటోగ్రాఫ్ వస్తుంది. ఆ వెంటనే మీటర్ రీడింగ్ కన్పిస్తుంది. మీ మీటర్ నంబర్, కేటగిరి, లోడ్, ఫేజ్, ఓపెనింగ్ రీడింగ్ గతంలో తీసిన మీటర్ రీడింగ్ తేదీ దర్శనమిస్తుంది. మనకు సాధారణంగా కన్పించే బిల్ మాదిరిగానే మీ స్మార్ట్‌ మొబైల్‌లో అదే తరహాలో బిల్‌ జనరేట్‌ అవుతుంది. ఆ బిల్లుకు నగదును సైతం కేవలం ఒక్క నిమిషంలోనే ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించవచ్చు.

సరిగ్గా ఆపరేట్ చేయకపోతే..

ఒకవేళ మీరు సరిగ్గా ఆపరేట్ చేయకపోతే మీ మీటర్‌ను ఫొటో తీసుకుని... అప్పుడు దాన్ని యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. అది స్కాన్ అయిపోయి వెంటనే మీకు బిల్లు కన్పిస్తుంది. ఆ వెంటనే మీరు బిల్ చూసుకుని దానికి సంబంధించిన నగదు చెల్లింపులను చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: కొవిడ్ చికిత్స‌: న‌గ‌దు రూపంలో ఎంత చెల్లించ‌వచ్చు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.