ETV Bharat / state

భార్యలను వేధించి విదేశాలకు వెళ్లే...భర్తల్లారా! జాగ్రత్త! - wife

భార్యను వేధించాం..దొరకకుండా ఉండాలంటే...ఏదో ఓ ఉద్యోగం పేరుతో విదేశానికి వెళితే సరి అనుకుంటున్నారా? అయితే మీ పని అయిపోయినట్లే. మీరు ఎక్కడికి వెళ్లినా వదిలే ప్రసక్తే లేదంటోంది విదేశాంగ శాఖ. పాస్​పోర్టును రద్దు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రవాసులూ ఇద్దరు ఉన్నారు.

భార్యలను వేధించి విదేశాలకు వెళ్లే...భర్తలారా! జాగ్రత్త!
author img

By

Published : Aug 3, 2019, 1:02 PM IST

మా అల్లుడు విదేశాల్లో ఉద్యోగం చేయాలి. ఎంత ఖర్చయినా పర్లేదు.. పెళ్లి ఘనంగా చేయాలి. అమ్మాయిల తల్లిదండ్రుల్లో ఇదో క్రేజ్. మంచి సంబంధం...అల్లుడు మంచి వాడైతే సరే.. పెళ్లి చేసుకుని ఇక్కడ నాలుగురోజులు ఉండి..అమ్మాయిని నానా హింసలు పెట్టి ఉద్యోగం పేరుతో విదేశాలకు వెళ్లేవాడైతే. అలాంటి వారిపై గృహ హింస కేసులు నమోదవుతున్నా ఏం చేయలేని పరిస్థితి. అలాంటి అల్లుళ్ల కోసమే విదేశాంగ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టనుంది.

పాస్​పోర్టు రద్దే
పెళ్లి చేసుకుని హింసలు పెట్టి.. ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్తున్న అబ్బాయిలను చూస్తూనే ఉన్నాం. వాటిపై విదేశాంగ మంత్రిత్వ శాఖకు వచ్చే ఫిర్యాదుల పెరగడంతో ప్రత్యేక దృష్టి పెట్టింది. లుక్ అవుట్ సర్క్యులర్, ఎన్​బీడబ్ల్యూ వారెంట్లు జారీ చేసినా ప్రయోజనం లేకపోవడం వల్ల... ఏకంగా పాస్ పోర్టు రద్దు చేయడం ఒక్కటే మార్గమని నిర్ణయం తీసుకుంది.

ఏం చేసినా అంతే సంగతి
వివాహితలు మహిళా కమిషన్ ముందు ఈ తరహా ఫిర్యాదులను ఉంచారు. భర్తలు తమను హింసకు గురిచేసి ఏళ్ల తరబడి విదేశాల్లో ఉండిపోవడం, వారి చిరునామాలను మార్చేయడం వల్ల వారిపై ఎటువంటి చర్యలకు ఆస్కారం లేకపోవడం వంటి ఇక్కట్లను వివరించారు. ఈ మేరకు వారి పాస్​పోర్టులను రద్దు చేయాలని నిర్ణయించింది విదేశాంగ శాఖ.

భార్యలను వేధించి విదేశాలకు వెళ్లే...భర్తల్లారా! జాగ్రత్త!

ఏపీలో ఇద్దరివీ!
జాతీయ మహిళా కమిషన్ నుంచి వచ్చిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరి పాస్ పోర్టును రద్దు చేశారు. ఇప్పుడు వారంతట వారే స్వదేశానికి వచ్చేందుకు వీలుగా ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఇండియన్ ఎంబసీ నుంచి జారీ చేస్తారు. వెంటనే వారి పాస్ పోర్టు రద్దు తప్పదు. ఇందుకోసం పాస్ పోర్టు కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికార్లు వెల్లడించారు.

ఇవీ చూడండి: ఐఏఎస్​ మద్యం మత్తుకు పాత్రికేయుడు బలి!

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.