ETV Bharat / state

Lawcet: లాసెట్​ దరఖాస్తుల గడువు పొడిగింపు - hyderabad latest news

ఎల్ఎల్​బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్​సెట్ ఆన్​లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా జులై 5 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు లాసెట్​ కన్వినర్ జీబీ రెడ్డి తెలిపారు. ఆలస్య రుసుముతో ఆగస్టు 10వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు.

Extension of Lawcet Applications
లాసెట్​ దరఖాస్తుల గడువు పొడగింపు
author img

By

Published : Jun 26, 2021, 11:39 AM IST

రాష్ట్రంలో ఎల్ఎల్​బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్​సెట్ దరఖాస్తుల గడువును మరోసారి పొడగించినట్లు కన్వినర్​ జీబీ రెడ్డి తెలిపారు. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా జులై 5 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో ఆగస్టు 10వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు ఆన్​లైన్​లో అభ్యర్థులు సమర్పించిన వివరాలు సవరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.

ఆగస్టు 8 నుంచి వెబ్ సైట్లో​ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆగస్టు 23న ఎల్ఎల్బీ​ ప్రవేశాల కోసం లాసెట్, ఎల్ఎల్ఎం కోసం పీజీఎల్ సెట్ జరగనుంది. ఆగస్టు 26న కీ విడుదల చేసి... 27వ తేదీ సాయంత్రం 5 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు. తుది కీ, ఫలితాల తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు జీబీ రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి: డెల్టా భయంతో ఆ దేశాల్లో మళ్లీ ఆంక్షలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.