ETV Bharat / state

టీఎస్​ఆర్​జేసీ, ఎల్​పీసెట్ దరఖాస్తుల గడువు పెంపు - tsrjc 2021 latest news

కరోనా కారణంగా పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును పొడిగించారు. టీఎస్​ఆర్​జేసీ దరఖాస్తులను ఈ నెల 30 వరకు స్వీకరించనున్నట్లు కార్యదర్శి తెలిపారు. ఎల్​పీసెట్ దరఖాస్తులను ఈనెల 28 వరకు సమర్పించవచ్చని పేర్కొన్నారు.

tsrjc, lpcet
టీఎస్​ఆర్​జేసీ, ఎల్​పీసెట్​
author img

By

Published : Jun 20, 2021, 7:25 AM IST

రాష్ట్రంలో జరగనున్న పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు తేదీలను పొడిగించారు. టీఎస్​ఆర్​జేసీ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు ఈనెల 30 వరకు అవకాశం కల్పించారు. ఈ గడువు నేటితో ముగిసినప్పటికీ.. కరోనా ప్రభావం, తల్లిదండ్రుల వినతితో పొడిగించినట్లు కార్యదర్శి తెలిపారు. రాష్ట్రంలోని 33 జనరల్ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం టీఎస్​ఆర్​జేసీ నిర్వహిస్తున్నారు. http://tsrjdc.cgg.gov.in ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి సూచించారు.

ఐటీఐ చదివిన విద్యార్థులు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఎల్​పీసెట్ దరఖాస్తుల తేదీలను పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి సి.శ్రీనాథ్ తెలిపారు. రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 30 వరకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఎల్​పీసెట్ పరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదని.. పరీక్ష జరిగిన పది రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి: Unlock: ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటించాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.