ETV Bharat / state

ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌  'ఓరియన్‌ కార్యాలయం' ప్రారంభం - MD ABHISHEK THOMAR

ప్రపంచవ్యాప్తంగా తమ వ్యూహాత్మక కేంద్రాల్లో హైదరాబాద్​ ఒకటని అంతర్జాతీయ సంస్థ ఎస్ అండ్ పీ పేర్కొంది. సేవల విస్తరణలో భాగంగా భాగ్యనగరంలో కొత్తగా ఓరియన్‌ కార్యాలయాన్ని ప్రారంభించింది. దేశంలో మార్కెట్‌ పెరిగిన కొద్దీ నగరంలో సంస్థను విస్తరించనున్నామని సంస్థ భారత ఎండీ స్పష్టం చేశారు.

దేశంలో మార్కెట్‌ పెరిగిన కొద్దీ నగరంలో సంస్థను విస్తరిస్తాం : సంస్థ ఎండీ
author img

By

Published : Jul 11, 2019, 6:03 PM IST

ప్రముఖ రేటింగ్స్‌ సంస్థ ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ హైదరాబాద్‌లో తన వ్యూహాత్మక కేంద్రమైన 'ఓరియన్‌ కార్యాలయాన్ని' ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని 850 మంది పనిచేసే విధంగా రూపొందించారు. ఇప్పటికే ఈ కేంద్రంలో 700 మంది పనిచేస్తుండగా దాదాపు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణ నిర్మాణానికి మరో రూ. 70కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సంస్థ భారత కార్యకలాపాల ఎండీ అభిషేక్‌ తోమర్‌ తెలిపారు.
సంస్థకు హైదరాబాదే ప్రధానం
ఎస్​అండ్​పీ గ్లోబల్‌కు హైదరాబాద్‌ చాలా ముఖ్యమని, ఇక్కడ సాంకేతికత లభ్యత బాగుందని అభిషేక్‌ తోమర్‌ పేర్కొన్నారు. దేశంలో గూర్​గావ్‌, అహ్మదాబాద్‌ కలిపి 3000 మంది ఉద్యోగులు ఉంటే ఒక్క హైదరాబాద్‌ కార్యాలయంతో పాటు ఓరియన్ కలిపి సుమారు 4500 మంది ఉద్యోగులు ఉన్నారని వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ వ్యూహాత్మక కేంద్రం ఓరియన్‌ కార్యాలయం ప్రారంభం

ఇవీ చూడండి : తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: మందకృష్ణ మాదిగ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.