రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావం, కరవు పరిస్థితులు ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ సమన్వయంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమాయత్తమవుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ పంట కాలంలో 52 శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటల సాగు పూరైంది. మిగతా పైర్ల సాగు ప్రశ్నార్థకంగా మారడం వల్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొద్దిపాటి వర్షాలకు విత్తనాలు వేసుకున్నప్పటికీ చాలాచోట్ల ఎండిపోయాయి. ఇక నుంచి వర్షాల రాక ఆశాజనకంగా ఉంటాయన్న పీజేటీఎస్‌ఏయూ విస్తరణ విభాగం సంచాలకులు డాక్టర్ దండ రాజిరెడ్డితో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి.
ఇదీచూడండి:నేడు షీలా దీక్షిత్ అంత్యక్రియలు