ETV Bharat / state

పుస్తక ప్రియులకు శుభవార్త.. 10 లక్షల పుస్తకాలతో ప్రదర్శనశాల ఏర్పాటు.. ఎక్కడంటే..? - హైదరాబాద్‌ నగర వార్తలు

books Exhibition at Hyderabad: పుస్తకం హస్తభూషణం అంటారు పెద్దలు. నేటి యువత చేతుల్లో పుస్తకాల కన్నా.. మొబైల్‌ ఫోన్లే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. పుస్తకాలు చదవటం వల్ల వివిధ రకాలైన దృక్పథాలు, అనుభవాలు, పాత్రల గురించి తెలుసుకునే వీలుంటుంది. ఇంతటి మేలు చేసే అమూల్యమైన పుస్తకాలన్నీ ఒకే దగ్గర ఏర్పాటు చేసి పుస్తక ప్రియులను ఆహ్వానిస్తుంది కితాబ్‌ లవర్స్‌ పుస్తక ప్రదర్శన.

books Exhibition
books Exhibition
author img

By

Published : Oct 7, 2022, 4:04 PM IST

పుస్తక ప్రియులకు శుభవార్త.. 10 లక్షల పుస్తకాలతో నగరంలో పస్తక ప్రదర్శనశాల ఏర్పాటు

books Exhibition at Hyderabad: పుస్తకం.. జ్ఞాన సముపార్జనకు మూలమైన ఆయుధం. ఇంకా చెప్పాలంటే తలదించుకొని పుస్తకాన్ని చదివితే.. అది మనల్ని తల ఎత్తుకుని జీవించేలా చేస్తుంది. ఇంతటి అమూల్యమైన పుస్తకాలన్నీ కలగలిపి హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని మారుతీ గార్డెన్‌ లోడ్​ ది బాక్స్​ అనే థీమ్‌తో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దిల్లీకి చెందిన కితాబ్‌ లవర్స్‌ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ప్రముఖ రచయిత దుర్జోయ్‌ దత్తా ప్రారంభించారు.

బాక్స్‌లో సరిపడా పుస్తకాలు తీసుకెళ్లే అవకాశం: ఈ సందర్భంగా దత్తా రాసిన కొత్త పుస్తకం వెన్ ఐయామ్​ విత్​ యూ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రదర్శనలో రొమాన్స్‌ నుంచి ఫాంటసీ, నాన్‌ ఫిక్షన్‌, క్రైమ్‌, వివిధ రకాలైన దాదాపు 10 లక్షల పుస్తకాలు ఏర్పాటు చేసినట్లు కితాబ్‌ లవర్స్‌ వ్యవస్థాపకులు రాహుల్‌ పాండే తెలిపారు. లోడ్​ ది బాక్స్​ అనే థీమ్‌ 3 రకాలుగా ఉంటుంది. ఈ బాక్స్ మూడు సైజుల్లో రూ.1,100 నుంచి రూ.2,750 మధ్య ఉంటుంది.

10 లక్షల పుస్తకాలు ఏర్పాటు: బాక్సు కొనుగోలు చేసిన తర్వాత అందులో పట్టినన్ని పుస్తకాలు వినియోగదారులు తీసుకెళ్లవచ్చు. 10 లక్షల పుస్తకాలతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో అమ్మకాలు చేయడంతో పాటు పాత పుస్తకాలు కొనుగోలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 9 వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.