కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి భాజపా నాయకులకు సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఇప్పట్నుంచే కసరత్తులు ప్రారంభించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
పార్లమెంటరీ కమిటీ సమావేశం..
సోమాజీగూడా కత్రియా హోటల్లో సికింద్రాబాద్ పార్లమెంటరీ పార్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
వాటి పరిష్కారానికి పోరాడండి : కిషన్ రెడ్డి
ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై పోరాటాలు చేయాలని కిషన్ రెడ్డి సూచించారు.