ETV Bharat / state

Srinivas Goud: మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: శ్రీనివాస్ గౌడ్

author img

By

Published : Oct 24, 2021, 8:03 PM IST

మత్తు పదార్థాల తయారీ, రవాణా, విక్రయాలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అబ్కారీ​ శాఖమంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. మాదకద్రవ్యాలు పట్టుకున్న అబ్కారీ శాఖ అధికారులను హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఘనంగా సన్మానించారు.

Srinivas Goud
అబ్కారీ​ శాఖమంత్రి శ్రీనివాస్​ గౌడ్

రాష్ట్రంలోని మత్తు పదార్థాల సరఫరా నిర్మూలనే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకోవాలని అబ్కారీ​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ అన్నారు. అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను పట్టుకున్న పలువురు అధికారులను హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి సన్మానించారు. నిన్న ఒక్కరోజే రూ.2 కోట్లు విలువైన మెపిడ్రిన్‌ డ్రగ్‌ను గుర్తించి పోలీసులు సీజ్‌ చేశారని మంత్రి తెలిపారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అబ్కారీ శాఖ పని చేస్తుందని తెలిపారు. కేవలం నెల రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రమే అధికారుల లక్ష్యమన్నారు. అబ్కారీ అధికారులు ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంచి పనితీరు కనబరిచిన అధికారులకు అవార్డులు ఇస్తామని ప్రకటించారు. సమాచారం అందించిన వారికి ప్రోత్సాహకాలు ఉంటాయని మంత్రి వెల్లడించారు. ప్రణాళికలను రూపొందించి మత్తు పదార్థాల తయారీ, రవాణా, విక్రయాలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నాం. మన పోలీసులు ఒక్కరోజులోనే రూ.2 కోట్ల విలువైన మత్తు పదార్థాలను సీజ్​ చేశారు. మంచి పనితీరు కనబరిచే వారికి రివార్డులు అందిస్తాం. ప్రజలు కూడా సమాచారం ఇస్తే రివార్డులు ఇస్తాం. మత్తు పదార్థాల రవాణాను ఉక్కుపాదంతో అణచివేస్తాం. ఎక్కువగా ఒడిశా, ఆంధ్ర నుంచి రవాణా జరుగుతోంది. దీనిపై ప్రత్యేక శ్రద్ధతో మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే తమ లక్ష్యం- శ్రీనివాస్ గౌడ్, అబ్కారీశాఖ మంత్రి

Srinivas Goud: మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: శ్రీనివాస్ గౌడ్

ఇదీ చూడండి: drugs: హైదరాబాద్‌లో 3 కిలోల డ్రగ్స్‌ పట్టుకున్న ఎన్‌సీబీ.. నిందితుడు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.