మద్యం విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ ఆబ్కారీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఆర్పీ ధరకంటే ఎక్కువ, తక్కువ ధరకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ సోమేష్‌కుమార్ హెచ్చరించారు. కేసులతో పాటు రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామన్నారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో గరిష్ఠ చిల్లర ధరకంటే తక్కువ ధరకు విక్రయిస్తూ తోటి వ్యాపారులకు నష్టం కలిగిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని సోమేష్ కుమార్ పేర్కొన్నారు. ఆబ్కారీశాఖ జారీచేసిన ఉత్తర్వులపై తెలంగాణ లిక్కర్ అసోషియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: మద్యం టెండర్లకు భలే గిరాకీ..