extended time for sale of liquor: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం విక్రయ సమయాన్ని పొడిగించింది. డిసెంబరు 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. బార్ అండ్ రెస్టారెంట్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించేందుకు వీలు కల్పించారు.
మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పలు నిబంధనలు విధించారు. త్రీ స్టార్, ఆపై హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాల వద్ద సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలని నిర్వాహకులను ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశాల్లోనూ కెమెరాలు తప్పనిసరి చేశారు. అసభ్యకర నృత్యాలు లేకుండా చూడాలని కోరారు. వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్‌కి మించకూడదని షరతు విధించారు. పరిమితికి మించి టికెట్లు, పాసులు జారీ చేయవద్దని స్పష్టం చేశారు. పబ్బులు, బార్లలో మైనర్లను అనుమతించకూడదని పోలీసులు సూచించారు.
ఇవీ చదవండి: