Excise Dept On Amneshiya pub: అమ్నేషియా పబ్ ఘటనపై అబ్కారీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మైనర్లను పబ్‌లోకి ఎలా అనుమతించారన్న విషయంపై ఆరా తీశారు. పబ్ యాజమాన్యం నుంచి అధికారులు వివరాలు సేకరించారు. ఈ నెల 28న ఓ కార్పొరేట్ స్కూల్ పేరు మీద లేఖతో పబ్‌లో అనుమతి తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే వాళ్లకు మద్యం సరఫరా చేసినట్లు ఆధారాలు లేవని అధికారులు తేల్చేశారు. భవనంలోని నాలుగో అంతస్తులో పార్టీకి అనుమతిచ్చినట్లు తెలిపారు. సమగ్ర నివేదిక సిద్ధం చేసి అబ్కారీ శాఖ ఉన్నతాధికారులకు నివేదించారు.
ఈ నెల 28న పార్టీ చేసుకునేందుకు ఓ కార్పొరేట్ స్కూల్‌కు చెందిన సీనియర్ విద్యార్ధి అమ్నేషియా పబ్ మేనేజర్‌ను కలిసి రూ.2 లక్షలు అడ్వాన్స్ చెల్లించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 150 మందికి అనుమతి తీసుకున్నట్లు వెల్లడించగా.... 180 మందికిపైగా హాజరైనట్లు యాజమాన్యం వెల్లడించిందని ఎక్సైజ్ అధికారులు వివరించారు. వాస్తవానికి పబ్‌లో మద్యం, ఆహార పదార్థాలు, పబ్, ఫంక్షన్లు చేసుకోడానికి ఇలా నాలుగు ఫ్లోర్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అయితే వీరికి నాలుగో అంతస్తులో పార్టీ చేసుకునేందుకు అనుమతించినట్లు వెల్లడించారు. అందరూ మైనర్లు కావడం వల్ల.. నాలుగో అంతస్తులోకి మాత్రమే రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకున్నట్లు పబ్ యాజమాన్యం తెలిపింది. ఇతర అంతస్తుల్లోకి వెళ్లకుండా బౌన్సర్లను పెట్టడంతో పాటు లిప్టు కూడా ఆ ఫ్లోర్‌కే ప్రత్యేకంగా కేటాయించినట్లు పబ్ మేనేజర్ వెల్లడించారని అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. అదే విధంగా అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అబ్కారీశాఖ అధికారులు మద్యం సరఫరా జరగలేదని తేల్చేశారు.
ఇవీ చూడండి: Jubleehills gang rape: పబ్‌లో పార్టీ ఇచ్చింది ఎవరు? ఇన్నోవా కారు ఎక్కడుంది?
27 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకొడుకులు.. భావోద్వేగంతో కంటతడి