రాష్ట్రంలోని మద్యం దుకాణాల నుంచి ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని నెలాఖరులోపు వసూలు చేయాలని ఆ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. మద్యం దుకాణాలు తెరిచే ముందు ఆయా దుకాణాల్లో ఉన్న నిల్వలను ఇటీవల స్థానిక అధికారులు పరిశీలించి వివరాలను ప్రభుత్వానికి నివేదించారు.
ఇటీవల పెంచిన 16 శాతం ధరలను ఆ నిల్వలపై కూడా వర్తింప చేశారు. బాటిల్ పరిమాణం, బ్రాండ్‌ను బట్టి.. కనీసం పది నుంచి గరిష్ఠంగా 480 రూపాయల వరకు పెరిగింది. దానిని ప్రత్యేక ఎక్సైజ్ సుంకంగా పేర్కొంటున్న అధికారులు.. ఈ నెలాఖరు లోపు దుకాణదారుల నుంచి వసూలు చేయాలని కింది స్థాయి అధికారులకు కమిషనర్ స్పష్టం చేశారు. ఆ తర్వాత చెల్లించే వారు 18 శాతం వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని సర్ఫరాజ్ తెలిపారు. అయితే 18 శాతం వడ్డీతో చెల్లించేందుకు జులై చివర వరకు గడువు విధించారు.
ఇవీ చూడండి: కూలీ బతుకు.. అందని మెతుకు !