కాంగ్రెస్ పార్టీ ముందు చూపు వల్లనే హైదరాబాద్‌లో మెట్రో ప్రారంభమైందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. 2014లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో... మెట్రో నిర్మాణాన్ని అడ్డుకుని తీరతామని కేసీఆర్ హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం, ఓఆర్‌ఆర్, మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్ణయాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నవేనని పొన్నాల స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని తీసుకొస్తే... కేసీఆర్ ఆ నీళ్లను గజ్వేల్‌కు తీకుసుపోయారని ఆరోపించారు. మెట్రో ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణమైన కేసీఆర్... ప్రజలకు క్షమాపణలు చెప్పడమే కాకుండా... వ్యయ పెరుగుదలకు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.