.
'రైల్వే బడ్జెట్లోనూ తెలంగాణకు అన్యాయం ' - TRS latest news
రైల్వే బడ్జెట్లోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కొనసాగుతున్న పనులకు నిధులను కేటాయింపులు చేశారే తప్ప... కొత్త లైన్ల ఊసే లేదని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్-జగిత్యాల-కరీంనగర్-కాజీపేట మార్గంలో కొత్తగా ఎక్స్ప్రెస్ రైలు డిమాండ్ ఉన్నా కేంద్రం స్పందించలేదని విమర్శించారు. కరీంనగర్-మానకొండూర్- హుజూరాబాద్-కాజీపేట మధ్య రైల్వే లైన్ సర్వేకు 2017-18లో రూ.2 కోట్లు కేటాయించినా... ఇప్పటి వరకు దానిపై ఎలాంటి పురోగతి లేదని వినోద్ కుమార్ మండిపడ్డారు.
Ex MP Vinod Kumar Respond On Railway Budget
.