ETV Bharat / state

సెస్​తో ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్ కుమార్ భేటీ - వినోద్ కుమార్ భేటీ

సెస్‌తో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ సమావేశమయ్యారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అధికారులతో చర్చించారు. రాష్ట్ర సంక్షేమ పథకాలను సెస్‌ పూర్తిగా అధ్యయనం చేయాలని ఆయన కోరారు.

ex mp vinod kumar meeting with cess
సెస్​తో ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్ కుమార్ భేటీ
author img

By

Published : Jan 9, 2020, 12:40 AM IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్- సెస్‌ను ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కోరారు. సెస్ సంచాలకులు, బోధనా సిబ్బంది, అధికారులతో వినోద్ కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, నీటిపారుదల, ఫుడ్ ప్రాసెసింగ్, ఫిషరీస్, బీమా వంటి రంగాలతోపాటు సంక్షేమ పథకాలకు సంబం‍ధించి అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. సెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అధ్యయన కార్యక్రమాలను సంచాలకులు రేవతి వివరించారు.

కాళేశ్వరం సహా ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో రైతులు లక్ష్యాన్ని మించి వరి పండిస్తున్నారన్న వినోద్ కుమార్... ఇతర దేశాల్లో మార్కెటింగ్ చేసే అవకాశాలపై విస్తృతంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సెస్ బృందాన్ని కోరారు. పంటలబీమా పథకం ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదని, ఈ విషయంలో ఉత్తమ విధానం కోసం అధ్యయనం చేయాలన్నారు. రైతుబంధు మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పంటల మార్పిడి విధానం అమలు, సేంద్రియ పంటల సాగుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని కోరారు.

సెస్​తో ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్ కుమార్ భేటీ

ఇవీ చూడండి: పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉంటాం..

File : TG_Hyd_91_08_Vinod_Kumar_AV_3053262 From : Raghu Vardhan Note : Feed from Whatsapp ( ) రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ - సెస్ ను ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కోరారు. సెస్ సంచాలకులు, బోధనాసిబ్బంది, స్కాలర్స్, అధికారులతో వినోద్ కుమార్ సహా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయం, నీటిపారుదల, ఫుడ్ ప్రాసెసింగ్, ఫిషరీస్, బీమా వంటి రంగాలతో పాటు సంక్షేమ పథకాలకు సంబం‍ధించి అనుసరించాల్సిన విధానాలపై సమావేశంలో చర్చించారు. సెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అధ్యయన కార్యక్రమాలను సంచాలకులు రేవతి వివరించారు. కాళేశ్వరం సహా ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో రైతులు లక్ష్యాన్ని మించి వరి పండిస్తున్నారన్న వినోద్ కుమార్... ఇతర దేశాల్లో మార్కెటింగ్ చేసే అవకాశాలపై విస్తృతంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సెస్ బృందాన్ని కోరారు. ప్రజల ఆహార అలవాట్లు మారేలా పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించాలన్న ఆయన... అందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రచించాలని సూచించారు. పంటలబీమా పథకం ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదని, ఈ విషయంలో ఉత్తమ విధానం కోసం అధ్యయనం చేయాలని వినోద్ చెప్పారు. రైతుబంధు మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పంటల మార్పిడి విధానం అమలు, సేంద్రీయ పంటల సాగుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని కోరారు. జలాశయాల్లో చేపల పెంపకానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేయాలని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అనువరించాల్సిన విధానాలపై సెస్ అధ్యయనం చేయాలన్న ఆయన... సంక్షేమ పథకాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. పబ్లిక్ ఫైనాన్స్ రంగంపై సెస్ అధ్యయనం చేయాలని కోరిన ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి... వనరుల సేకరణ దిశగా అవసరమైన సిఫార్సులు చేయాలని కోరారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.