EX MLA Vishnu Vardhan Reddy Join BRS : కాంగ్రెస్ పార్టీలో అవినీతి తారాస్థాయికి చేరిందని మంత్రి హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. పార్టీ కోసం పనిచేసే వారికి కాకుండా కోట్లకు సీట్లను అమ్ముకుంటుందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్(Congress) పార్టీ అసంతృప్త నేత మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిని కలిసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ వాదులకు తెలంగాణ ద్రోహులకు మధ్య జరుతుగున్న పోటీ ఈ ఎన్నికలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Harish Rao Comments on Congress : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని మంత్రి హరీశ్‌రావు(Harish Rao) విమర్శించారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుందనేది ప్రజలు గుర్తించాలని తెలిపారు. పట్టపగలే డబ్బు కట్టలతో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. దీంతో పాటు సీట్లు అమ్ముకున్న వ్యక్తి అని మండిపడ్డారు.
TDP leader Ravula Chandrasekhar Reddy joining BRS : బీఆర్ఎస్లో చేరిన రావుల చంద్రశేఖర్ రెడ్డి
"బీఆర్ఎస్ పార్టీలో చేరాలని విష్ణువర్ధన్ రెడ్డిని కోరాము. జనార్దన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అవమానించిందని విష్ణు బాధపడ్డాడు. మేము, విష్ణు అందరం ఐదేళ్లు శాసన సభ సభ్యులుగా ఉన్నాం. అనేక ఉద్యమాల్లో విష్ణు మాతో కలిసి పోరాడాడు. బీఆర్ఎస్లో చేరేందుకు విష్ణు సుముఖత వ్యక్తం చేశారు."- హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
EX MLA Vishnu Vardhan Reddy Comments on Congress : మరోవైపు కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్(Vishnu Vardhan Reddy) అన్నారు. తనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి కాంగ్రెస్ తమ రక్తం అనుకునేవారని తెలిపారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు ఇలా మారుతాయని అనుకోలేదని విచారం వ్యక్తం చేశారు. తనకు కూడా కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే గాంధీభవన్ అమ్ముడుపోతుందని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌తో చాలా సేపు మాట్లాడానని.. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు.
Nagam Janardhan Reddy Join BRS Party : కొంత మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారు వేరే పార్టీలోకి వెళ్లడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం నాగర్ కర్నూల్ టికెట్ ఆశించిన నాగం జనార్దన్ రెడ్డికు.. కాంగ్రెస్ సీటు ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్లో చేరతానని ప్రకటించారు. ముందుగా ఆయనను ఇంటి దగ్గర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కలిసి పార్టీలోకి ఆహ్వానించగా.. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు.
Nagam Janardhan Reddy Join BRS : బీఆర్ఎస్ గూటికి నాగం జనార్దన్ రెడ్డి.. త్వరలోనే చేరిక
Harish Rao Interesting Comments : 'కేసీఆర్ మళ్లీ సీఎం కాకపోతే.. హైదరాబాద్ మరో అమరావతి అవుతుంది'