ETV Bharat / state

'నా మరణదిన వేడుకలకు ప్రతి ఒక్కరూ రండి'.. ఆహ్వాన పత్రిక వైరల్ - guntur latest news

ఏ మనిషైనా పుట్టడం, మరణించడం సహజం. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి.. ఉన్నంత వరకు ఆనందంగా జీవించాలని చాలా మంది పుట్టినరోజు, ఇతర వేడుకలను వైభవంగా జరుపుకుంటారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి భిన్నంగా ఆలోచించి.. తన మరణ దిన వేడుకలను జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను పంచడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందంటే?

'నా మరణదిన వేడుకలకు ప్రతి ఒక్కరూ రండి'.. వైరల్​ అవుతున్న మాజీమంత్రి ఆహ్వాన పత్రిక

author img

By

Published : Dec 17, 2022, 11:01 AM IST

పుట్టిన రోజు, పెళ్లిరోజు, షష్టి పూర్తి ఇలా పలు వేడుకలను అందరం జరుపుకుంటాం.. అందుకు సంబంధించిన పత్రికలను బంధువులకు పంచుతాం. కానీ.. ఏపీలోని బాపట్ల జిల్లా చీరాలలో ఓ వ్యక్తి మరణ దిన వేడుకల ఆహ్వాన పత్రాలు పంచడం హట్‌టాపిక్‌గా మారింది. చీరాలలో పేరొందిన వైద్యుడు, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. తన 12వ మరణ దిన వేడుకలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికలు పంపిస్తున్నారు. తాను 75 ఏళ్లు జీవించాలని అనుకున్నానని.. ఇప్పటికే 63 పూర్తయ్యాయని అంటున్నారు. ఇంకా జీవించాల్సింది 12 ఏళ్లేనని చెబుతున్నారు. వచ్చే ఏడాది 11వ మరణ దినం జరుపుకుంటానని అంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.