Marri Shashidhar Reddy: ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందని తెలంగాణ మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది పార్టీ బలోపేతం కోసమే అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హోటల్ అశోకలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు.
కాంగ్రెస్ బలోపేతం కావాలంటే అవసరమైన ప్రతి చోటా మార్పులు చేయాలని మర్రి శశిధర్ రెడ్డి సూచించారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేసినా.. పంజాబ్‌లో చన్నీని సీఎం చేసినా.. అన్ని నిర్ణయాలు అధిష్ఠానమే తీసుకుందని వెల్లడించారు. పార్టీ మనుగడకు రానున్న ఎన్నికలు చాలా కీలకమని వ్యాఖ్యానించారు.
"మేము అసమ్మతి వర్గం కాదు. చాలా సార్లు మేం సమావేశమయ్యాం. పార్టీ నిర్మాణం బాగు కోసమే ఏర్పాటు చేసిన మీటింగ్ ఇది. రాష్ట్రం, దేశ వ్యాప్తంగా జరిగిన కొన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. మళ్లీ అలాంటి పరిస్థితులు రాకూడదనే మేం సమావేశం ఏర్పాటు చేశాం. పార్టీ బలోపేతం కోసం ఎంతైనా కృషి చేస్తాం." -మర్రి శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ మంత్రి
ఇదీ చదవండి: Bandi Sanjay News : జిల్లా అధ్యక్షులతో బండి సంజయ్ భేటీ