కేంద్రం ప్రకటించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్రప్రభుత్వం జీవో విడుదల చేయడంపై ఫెడరేషన్ జాతీయ ఛైర్మన్ మల్లాది పవన్ హర్షం వ్యక్తం చేశారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల అంశంపై హైదరాబాద్లోని సోమాజిగూడలో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈనెల 20లోగా రిజర్వేషన్ల అమలుపై నిర్ణయం ప్రకటించకపోయి ఉంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేయడం శుభపరిణామమన్నారు. ఓసీ గర్జనలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన మాటలు ఉద్యమాన్ని నీరుగార్చేలా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జాతీయ ఛైర్మన్ పవన్ మల్లాది, సంస్థ ప్రతినిధులు జగన్ మోహన్ శర్మ, చైతన్య, నిరంజన్ దేశాయ్, విశ్వేశ్వర్ శర్మ పాల్గొన్నారు.