ETV Bharat / state

అసెంబ్లీ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు - ఈవీఎంల పంపిణీ ప్రక్రియను ప్రారంభించిన ఈసీ - EC Arrangements for Telangana Assembly Elections

EVM Distribution Process Begins in Telangana : శాసనసభ ఎన్నికల పోలింగ్ కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్‌ (EVM) కేటాయింపు ప్రారంభమైంది. 78 నియోజకవర్గాల్లో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాల కేటాయింపు ప్రక్రియను చేపట్టామని ఎన్నికల సంఘం పేర్కొంది. మిగిలిన 41 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున.. అదనపు బ్యాలెట్ యూనిట్లను కూడా ఇప్పటికే ఆ జిల్లాలకు పంపామని తెలిపింది.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2023, 8:55 AM IST

EVM Distribution Process Begins in Telangana : తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంల కేటాయింపుపై కసరత్తు.. బుధవారంలోగా పూర్తి చేయాలని అధికారులకు ఎన్నికల సంఘం స్పష్టం (Election Commission) చేసింది. ప్రతి నియోజకవర్గానికి కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలెట్లు వీవీప్యాట్‌ల పంపిణీ ప్రక్రియను.. 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టామని ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్నికల పరిశీలకుల సమక్షంలో వాటి తొలిదశ తనిఖీలు పూర్తి చేసిన తర్వాత కేటాయిస్తున్నామని చెప్పింది. మరో 41 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అదనపు బ్యాలెట్‌ యూనిట్లు పంపామని పేర్కొంది. అక్కడ కూడా తొలి విడత తనిఖీలు పూర్తి చేసి కేటాయించాలని చెప్పామని వెల్లడించింది.

తెలంగాణలో పక్కా ప్రణాళికతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి : సీఈసీ

EC Arrangements Telangana Assembly Elections : సువిధ పోర్టల్ ద్వారా పార్టీలు, అభ్యర్థులకు ఇప్పటి వరకు 22,254 అనుమతులు ఇచ్చామని అధికారులు తెలిపారు. సీ-విజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 5183.. 1950 హెల్ప్‌లైన్‌కు 1987 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. నేషనల్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సర్వీస్‌కు 20,670 ఫిర్యాదులు వస్తే అందులో 20,302 పరిష్కరించామని చెప్పారు. జిల్లా కాల్ సెంటర్లకు 4673 ఫిర్యాదులు రాగా.. అందులో 4543 పరిష్కరించినట్లు అధికారులు వివరించారు.

Huge Amount Of Money Seized in Telangana During Election Code : ఎన్నికల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.603 కోట్ల విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. అందులో నగదు రూ.214 కోట్లు కాగా.. బంగారు, ఆభరణాల విలువ రూ.179 కోట్లని చెప్పారు. రూ.96 కోట్ల మద్యం, రూ.34 కోట్ల డ్రగ్స్, రూ.78 కోట్ల విలువైన ఇతర వస్తువులు పట్టుబడ్డాయని అధికారులు వివరించారు.

మరోవైపు భద్రత అవసరాలు ఉన్న వారు మినహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ వాహనాలు వినియోగించకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏదో కారణంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అధికారులు సైతం.. ప్రభుత్వ వాహనాలు ఉపయోగించకూడదని తెలిపింది. రాజకీయ పార్టీల వారు, అభ్యర్థులు ఎన్ని వాహనాలనైనా ఉపయోగించవచ్చని పేర్కొంది. కానీ అన్నింటికి ముందస్తు అనుమతి ఉండాలని వివరించింది. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎం, జనసేన, బీఎస్పీ తదితర పార్టీల నుంచి.. 293 మంది స్టార్‌ క్యాంపెయినర్లకు అనుమతి ఇచ్చామని ఎన్నికల సంఘం వెల్లడించింది.

Telangana Assembly Elections 2023 : ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సీఈసీ కసరత్తు.. ఆకర్షణీయంగా పోలింగ్​ కేంద్రాల ముస్తాబు

Postal Ballot Facility in Telangana 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot)ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. 28,057 మందికి అనుమతించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 80 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు.. గుర్తింపు పొందిన జర్నలిస్టులు, ఎన్నికల విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది, ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు సహా దివ్యాంగులకు కలిపి మొత్తం 13 విభాగాల వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఈసీ కల్పించింది.

ఈ క్రమంలోనే 44,097 మంది 12-డీ ఫామ్‌ ద్వారా దరఖాస్తు చేసినప్పటికీ.. వాటిని పరిశీలించి 28,057 మందిని అర్హులుగా గుర్తించామని అధికారులు తెలిపారు. వీరిలో అత్యధికంగా సిద్దిపేటలో 752 మంది ఉండగా, 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 లోపు మంది ఉన్నారని చెప్పారు. నవంబర్ 30న పోలింగ్ ఉండటంతో అంతకు ముందుగానే వీరు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణలో సవాళ్లు - కమాండ్ కంట్రోల్ ద్వారా అన్ని నియోజకవర్గాలపై ఈసీ నజర్

Excise Department Searches in Telangana : ఎన్నికల వేళ ఎక్సైజ్ శాఖ అలర్ట్.. మద్యం, డ్రగ్స్ సరఫరాపై పటిష్ఠ నిఘా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.