ETV Bharat / state

బ్రాండెడ్ లేబుళ్లు... డబ్బాలో నకిలీ ఆయిల్ - కాదేదీ కల్తీకి అనర్హం

కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లు... హైదరాబాద్ నగరంలో కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. నిత్యావసర నుంచి పిల్లలు తాగే పాల దాకా ప్రతిదీ కల్తీ చేస్తూ... జేబులు నింపుకుంటున్నారు. తాజాగా పాతబస్తీలో నకిలీ ఇంజిన్ ఆయిల్​ విక్రయిస్తున్న వ్యాపారస్థుడిని టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు.

everything is being adulterated in hyderabad
హైదరాబాద్​లో రెచ్చిపోతున్న కల్తీరాయుళ్లు
author img

By

Published : Dec 9, 2019, 6:57 PM IST

హైదరాబాద్​లో రెచ్చిపోతున్న కల్తీరాయుళ్లు

హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో కల్తీరాయుళ్లు హల్​చల్​ చేస్తున్నారు. తక్కువ సమయంలో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా అడ్డదారులు తొక్కుతున్నారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లతో జనాన్ని బోల్తా కొట్టిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కంటే... వ్యక్తిగత లాభార్జనే ధ్యేయంగా కల్తీ చేసి మార్కెట్​లోకి వదిలి ప్రజల ఆరోగ్యాంతో ఆడుకుంటున్నారు.

పాల నుంచి బియ్యం దాకా...

బియ్యంలో రాళ్లు, నాసిరకం బియ్యం కలపడం, కారంపొడికి రంపపు పొట్టు కలపడం, యూరియా, ఇతర రసాయనాలతో పాలు తయారు చేయడం, పెట్రోల్, డీజిల్​లో కిరోసిన్ కలపడం, సాధారణ ఇంజిన్ ఆయిల్​ను బ్రాండెడ్​ లేబులింగ్​ చేసి సొమ్ము చేసుకోవడం, మేలు రకం లిక్కర్ సీసాల్లో చౌక మద్యాన్ని నింపడం... ఇలా ప్రతిదీ కల్తీ చేస్తున్నారు. ఏది నకిలీ, ఏదీ అసలు అన్నది ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు.

దాడులకే పరిమితం...

తరచూ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించినా... కల్తీని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు అంతంతమాత్రమే! హైదరాబాద్ పాతబస్తీ లాల్​దర్వాజ ప్రాంతంలో... కల్తీ ఇంజిన్ ఆయిల్​ తయారీ కేంద్రంపై ఈస్ట్ జోన్ టాస్కఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ప్రాంగణమంతా డ్రమ్ములు, ఖాళీ ఆయిల్ ప్లాస్టిక్ డబ్బాలు, వివిధ ఆయిల్ కంపెనీల లేబుళ్లు పెద్ద సంఖ్యలో దర్శనమిచ్చాయి. ఆరు వందలకుపైగా వివిధ బ్రాండ్‌ల ఖాళీ ఆయిల్‌ డబ్బాలు, ఒక బ్యారెల్‌ ల్యూబ్రికెంట్‌ ఆయిల్‌, ఒక కార్టన్‌ డ్యూప్లికెట్‌ ఇంజిన్‌ అయిల్‌, ఆయిల్‌ నింపే మిషన్, ఐదు వందలకుపైగా బజాజ్‌, టీవీఎస్‌ ఆయిల్‌ లేబుళ్లు స్వాధీనం చేసుకున్నారు.

గ్రామీణ ప్రాంతాలే లక్ష్యం...

నిందితుడు దినేష్‌కుమార్‌ అగర్వాల్‌ను విచారించగా... విస్తుగొలిపే నిజాలు బయట పడ్డాయి. పదేళ్లుగా ఆయిల్‌ కల్తీ చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. రూ. 20 నుంచి రూ. 30 విలువైన ఆయిల్​ను బ్రాండెడ్ ఆయిల్ డబ్బాల్లో నింపి విక్రయిస్తున్నారు. నగరంలో పట్టుబడతామని భావించిన అగర్వాల్​... గ్రామీణ ప్రాంతాలను ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ దందా స్థావరంపై శనివారం రాత్రి అతన్ని అరెస్ట్‌ చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు... తదుపరి విచారణకు కోసం శాలిబండ పోలీసులకు అప్పగించారు.

TG_HYD_36_09_RAILWAY_CHORY_COUPLE_AB_3182400_TS10120 ( )రద్దీగా ఉండే రైళ్ళలో...స్టేషన్ లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దంపతులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. సాధారణ భోగీలలో వెళుతూ ప్రయాణికులు బ్యాగ్ ల నుంచి విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్నట్లు రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. ప్రయాణికుల వరుస ఫిర్యాదులతో వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టిన రైల్వే పోలీసులు సికిందరాబాద్ స్టేషనలో అనుమాన్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 32 తులాల బంగారు అభరణాలు స్వాదీనం చేసుకున్న పోలీసులు వీటి విలువ సుమారు 13 లక్షలు ఉంటుందని తెలిపారు. విలాస వంతమైన ఈవితానికి అలవాటు పడిని ఈ దంపతులు చోరీలకు పాల్పడుతున్నారని ఎస్పీ అనుదాధ వెల్లడించారు. బైట్: అనురాధ, సికిందరాబాద్ రైల్వే ఎస్పీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.