ETV Bharat / state

హడావుడి ఏం లేదు... అంతా చట్టం ప్రకారమే - అంతా చట్టం ప్రకారమే

మున్సిపల్ ఎన్నికలకు హడావుడిగా ఏర్పాట్లు చేస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని... అంతా చట్ట ప్రకారమే కొనసాగుతోందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఎనిమిది రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేయలేదని.. కేవలం వార్డుల విభజన మాత్రమే చేశామని పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది.

అంతా చట్టం ప్రకారమే
author img

By

Published : Aug 22, 2019, 5:49 AM IST

Updated : Aug 22, 2019, 7:37 AM IST

మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహాలపై ఆరోపణలు, అనుమానాలకు వివరణ ఇస్తూ.. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కౌంటరు దాఖలు చేసింది. చట్టాన్ని, నిబంధనలను పక్కన పెట్టి హడావుడిగా ఏర్పాట్లు చేస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ కౌంటరు దాఖలు చేశారు. ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియను 109 రోజుల నుంచి 8 రోజులకు కుదించలేదని తెలిపారు. ఎనిమిది రోజుల్లో కేవలం వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేశామని వివరించారు. రాష్ట్రమంతటా ఒకే విధంగా వార్డుల విభజన ప్రక్రియ జరిగేందుకు వీలుగా జీవో 459 జారీ చేసినట్లు కౌంటరులో సర్కారు తెలిపింది.

అంతా చట్టం ప్రకారమే

1373 అభ్యంతరాలు...

అభ్యంతరాల ప్రక్రియ కూడా చట్ట ప్రకారమే నిర్వహించినట్లు తెలిపింది. అభ్యంతరాల స్వీకరణ కోసం నోటీసు బోర్డులు, పత్రికల ద్వారా ప్రకటనలు జారీ చేశామని.. ఎమ్మెల్యేలు, మున్సిపాలిటీ కౌన్సిళ్లకు అభిప్రాయాలు తీసుకున్నట్లు వివరించారు. విస్తృతంగా ప్రచారం జరిగింది కాబట్టే.. 1373 అభ్యంతరాలు వచ్చాయన్నారు. అభ్యంతరాలన్నీ 24 గంటల్లో పరిష్కరించలేదని... ఐదు రోజుల పాటు ప్రక్రియ జరిగిందన్నారు.

ఈనెల 28న వాదనలు..

ఇంటింటి సర్వే నిర్వహణ కోసం మున్సిపల్ కమిషనర్లు సిబ్బందిని నియమించారని... రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ పార్టీలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించిందన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఇప్పటి వరకు వార్డుల విభజన, ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది ఖరారు, ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సుల పంపిణీ తదితర ప్రక్రియ పూర్తయిందని సర్కారు పేర్కొంది. వార్డులు, మేయర్, ఛైర్​పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉందన్నారు. చట్ట ప్రకారం మూడు రోజల్లో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తవుతుందని.. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు వివరించింది. ఈనెల 28న హైకోర్టులో వాదనలు జరగనున్నాయి.

ఇవీ చూడండి: దిల్లీలో రెచ్చిపోయిన దుండగులు... నడిరోడ్డుపైనే చోరీ!

Last Updated : Aug 22, 2019, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.