ETV Bharat / state

ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి..!

author img

By

Published : Mar 17, 2021, 9:08 AM IST

ఏపీలో పరిషత్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికలను నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా.. నోటిఫికేషన్​ను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఏకగ్రీవాలపై ఎక్కువగా అభ్యంతరాలు ఉండగా... ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణ సందిగ్ధంలో ఉంది. ఏకగ్రీవాలైన వారికి ధ్రువపత్రాలు అందించాలని ఏపీ హైకోర్టు ఆదేశించగా... ఎన్నికల ప్రక్రియ ఇకపై ముందుకు వెళ్తుందా లేదా అనే విషయమై సందేహం నెలకొంది. తాజా పరిణామాల దృష్ట్యా ఆ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ ఎస్​ఈసీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

everyone-is-interested-in-mptc-and-zptc-elections in andhra pradesh
ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి..!

ఆంధ్రప్రదేశ్‌లో ఏకగ్రీవాలైన స్థానాల్లో అభ్యర్థులకు ధ్రువపత్రాలు ఇవ్వాలని ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో... ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఏపీ హైకోర్టు తీర్పు దృష్ట్యా ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. న్యాయపరమైన అవరోధాలు తొలగిపోయినందునా... ఎన్నికలు నిర్వహించాలని వైకాపా ప్రభుత్వం కోరుతోంది. ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికలను రద్దు చేయాలని కోరుతున్నాయి. ఎన్నడూ లేని రీతిలో అత్యధిక స్థానాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఏకగ్రీవాలయ్యాయని... అధికార దుర్వినియోగం చేసి వైకాపా అక్రమాలకు పాల్పడిందని అప్పట్లో పలు పార్టీలు ఆరోపించాయి.

ఇదే అంశాన్నీ న్యాయస్థానానికి ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికలు రద్దు చేయాలని హైకోర్టులో జనసేన పార్టీ వేసిన పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. పరిషత్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు తీర్పునకు ముందు, తర్వాత ఎన్నికల నిర్వహణపై ఏపీ ఎన్నికల సంఘం ఏ ప్రకటన చేయలేదు. న్యాయస్థానంలో సందిగ్ధం తొలగేవరకు ఎన్నికలు నిర్వహించలేమని ఏపీ ఎస్​ఈసీ ఇటీవల స్పష్టం చేశారు. ఈనెల 18న మేయర్ల ఎన్నిక నిర్వహంచిన అనంతరం... 22 నుంచి 24 వరకు నిమ్మగడ్డ రమేశ్​కుమార్ ఎల్టీసీపై తీర్థయాత్రకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనే సందిగ్ధత నెలకొంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు గతేడాది మార్చి 7న నోటిఫికేషన్ జారీ అయ్యింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారైన తర్వాత కరోనా కారణంగా మార్చి 15న ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాప్తి తగ్గి పురపాలక ఎన్నికలను నిర్వహించినా... న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్​లో ఉండటం వల్ల ఎన్నికల ప్రక్రియను ఏపీ ఎస్​ఈసీ ప్రారంభించలేదు. పురపాలక ఎన్నికలను నిర్వహించింది. పరిషత్ ఎన్నికల్లో సభ్యుల బలవంతపు ఏకగ్రీవాలపై బాధితులనుంచి ఎన్నికల సంఘం ఇటీవల ఫిర్యాదులను ఆహ్వానించింది.

దీన్ని సవాల్ చేస్తూ... కొందరు కేసు వేయగా ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి ధ్రువపత్రాలు జారీ చేయాలని తీర్పు చెప్పింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ నిలిచి ఏడాది పూర్తైందని.. ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి ఆగిపోకుండా వెంటనే ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఎన్నికల ప్రక్రియకు 6 రోజులు సరిపోతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

ఎన్నికలను రద్దు చేయాలని జనసేన పార్టీ వేసిన పిటిషన్ ఏపీ హైకోర్టులో ఇంకా విచారణలో ఉంది. జగన్ ప్రభుత్వం కోరుతున్నా.. ఎన్నికల నిర్వహణపై ఏపీ ఎస్​ఈసీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశం ఉత్కంఠ రేపుతోంది. నిమ్మగడ్డ రమేశ్​కుమార్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఉన్న కొద్దిపాటి సమయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనే విషయంపై సందేహం నెలకొంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి సహా తాజా పరిణామాల దృష్ట్యా ఏపీ ఎస్​ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ఇదీ చదవండి: రెండు లక్షల కోట్ల బడ్జెట్... ఆమోదమే ఎజెండాగా మంత్రివర్గ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.