2030 నాటికి రోడ్లపై విద్యుత్ వాహనాలే తిరగాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు టీ ఫైబర్ ఎండీ సుజయ్ కరంపురి తెలిపారు. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలను తీసుకురావాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సెల్‌ఫోన్ తరహాలోనే త్వరలోనే ప్రతి ఒక్కరూ విద్యుత్ వాహనాలు వాడే రోజులు రాబోతున్నట్లు సుజయ్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో నిర్వహించిన ఈవీ సమ్మిట్ కార్యక్రమంకు ఆయన హాజరయ్యారు.
మహేశ్వరంలో ఈ సీటీ
బొలివియాలోనే లిథియం నిక్షేపాలు ఉన్నాయని అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు సుజయ్ పేర్కొన్నారు. బ్యాటరీ తయారీ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. మూడు బ్యాటరీ కంపెనీలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీల ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు బొలివియా దేశం ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. మహేశ్వరంలో ఈ సీటీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
బొలివియాతో ఒప్పందం
రానున్న రోజుల్లో ఈ పెట్టుబడులు ఆరు వేల కోట్లకు పెరగనున్నట్లు సుజయ్ వివరించారు. లిథియం సరఫరా కోసం ఒప్పందం చేసుకున్నట్లు బొలివియా అంబాసిడర్ జేజే కర్టేజ్ తెలిపారు. లిథియం ఒక్కటే విద్యుత్ నిల్వ చేయగలుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కర్టేజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూకె, బొలివియా పరిశ్రమల ప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు.
ఇదీ చూడండి : పరిశ్రమల వ్యర్థాలతో కాలుష్య కోరల్లో హైదరాబాద్ నీళ్లు