ETV Bharat / state

టాప్​ టెన్​ న్యూస్​@9PM

నేటి ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​@9PM
టాప్​ టెన్​ న్యూస్​@9PM
author img

By

Published : Sep 25, 2020, 9:03 PM IST

'బాలు అస్తమయం... భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు'

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం పట్ల కాంగ్రెస్ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన లోటు ఎవరూ పూడ్చలేనిదని పేర్కొన్నారు. వేల సంఖ్యలో పాటలు పాడి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ప్రభుత్వ లాంఛనాలతో శనివారం బాలు అంత్యక్రియలు

తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు. చెన్నై మహాలింగపురం నివాసంలో బాలుకు అభిమానులు నివాళి అర్పించారు. గానగంధర్వుడికి వేలమంది స్థానికులు పుష్పాంజలి ఘటించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

భాగ్యనగర మణిహారం.. దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభం

హైదరాబాద్ నగరానికి నిలిచే మరో ఐకాన్ దుర్గం చెరువు తీగల వంతెనను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. రూ.184 కోట్లతో నిర్మించిన‌ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జితో పాటు.. రోడ్ నెంబర్ 45 నుంచి దుర్గం చెరువు వరకు రూ. 150 కోట్లతో నిర్మించిన 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్​లను అందుబాటులోకి తీసుకొచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు

రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఎల్​ఆర్​ఎస్​కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తు రుసుం కింద ఖజానాకు రూ. 46.01 కోట్ల ఆదాయం వచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

రాష్ట్రంలో త్వరలోనే పూర్తిస్థాయి వైద్య సేవలు: ఈటల

రాష్ట్రంలో గాంధీ సహా ఇతర వైద్య కళాశాలల్లో త్వరలోనే పూర్తి స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మాలిక్యులార్ ల్యాబ్, కొవిడ్ పరీక్ష కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

భూ హత్య: గట్టు పంచాయతీలో ఇద్దరిని చంపిన ప్రత్యర్థి

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖ పూర్ గ్రామంలో పొలం గట్టు పంచాయతీలో జరిగిన ఘర్షణ ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. శాఖాపూర్​కు చెందిన శాంతయ్య (56), పరశురాముడికు మధ్య గత కొంత కాలంగా పొలం పంచాయతీ నడుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం పరశురాముడు.. శాంతయ్య పొలం గట్టును కలుపుకొని విత్తనాలు వేసేందుకు దున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

బిహార్​ ఫైట్​: ఎన్నికల నగారా మోగిందోచ్​..

బిహార్​ శాసనసభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించింది భారత ఎన్నికల కమిషన్​. కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్రంలోని 243 నియోజకవర్గాలకు.. మూడు దశల్లో పోలింగ్​ నిర్వహించనుంది ఈసీ. అక్టోబర్​ 28న తొలి దశ పోలింగ్ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

వ్యాక్సిన్‌ వినియోగానికి చైనాకు అనుమతిచ్చిన డబ్ల్యూహెచ్​ఓ!

కరోనా కాలంలో వ్యాక్సిన్​ కోసం ప్రపంచదేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే కరోనా పుట్టినిల్లు చైనాలో మాత్రం ప్రజలపై వ్యాక్సిన్​ను ప్రయోగిస్తున్నారు. ఇందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) అనుమతి ఇచ్చిందట. అంతేకాదు 2021 నాటికి 100 కోట్ల డోసులు తయారుచేయాలని చైనా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

హెటిరో కరోనా ఔషధం ప్యాక్ విడుదల- ధర ఎంతంటే?

స్వల్ప, మధ్య స్థాయి కరోనా బాధితులకు వాడే జనెరిక్ ఔషధం ఫావివిర్ 800/200ను భారత్​లో విడుదల చేసింది ఔషధ సంస్థ హెటిరో. మొత్తం 18 మాత్రలతో కూడిన ప్యాక్ ధర రూ.2,640గా నిర్ణయించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎస్పీ బాలు మృతిపై క్రీడాలోకం దిగ్భ్రాంతి

ప్రముఖ సింగర్ ఎస్పీ బాలు మృతిపై క్రీడాలోకం దిగ్భ్రాంతి చెందింది. రాబోయే తరాలకు ఆ గొంతుక ఓ స్ఫూర్తి అని అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

రకుల్​ వాదనలను రికార్డు చేసిన ఎన్​సీబీ అధికారులు

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నటి రకుల్ ప్రీత్ సింగ్ వాదనలను రికార్డు చేశారు ఎన్​సీబీ అధికారులు. హీరోయిన్ దీపికా పదుకొణె, అధికారుల ముందుకు శనివారం హాజరు కానుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.