శనివారం ఎస్పీ బాలు అంత్యక్రియలు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. చెన్నైలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో వీటిని నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా బాలు పార్థివదేహాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
బాలు మృతిపట్ల కేటీఆర్, హరీశ్ రావు విచారం
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు విచారం వ్యక్తం చేశారు. బాలు మృతి సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు తీరని లోటని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
'బాలు మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు'
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. ఇంకా ఏం చెప్పారంటే..?
'డార్లింగ్ ఇదేంటి అన్యాయం'
డార్లింగ్ ఇదేంటి అన్యాయం.. చాలా అన్యాయం ఇది. ఘంటశాల గారే తొందరగా వెళ్లిపోయారనుకుంటే మీరు కూడా గంధర్వులలో కలిసిపోయారా? చాలా అన్యాయం ఇది. అంటూ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్.. ఎస్పీబీ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇంకా నటకిరిటీ ఏమన్నారంటే..?
బాలు మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
దిగ్గజ గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం సంగీత ప్రపంచంలో తనదైన మార్క్ చూపించారు. దాదాపు 40 వేలకు పైగా పాటల్ని పాడి గిన్నిస్ రికార్డు సాధించారు. అలాంటి గాయకుడు తన మొదటి రెమ్యునరేషన్ గురించి ఓసారి చెప్పారు. ఎంతంటే..?
తలపై బండరాయితో మోది హత్య
హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం అర్ధరాత్రి ఓ వ్యక్తి తలపై బండరాయితో మోది హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
'ఆత్మనిర్భర్ భారత్' మంచి ప్రయత్నం: ఐఎంఎఫ్
కరోనా కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 'ఆత్మ నిర్భర్ భారత్' ఉద్దీపన ప్యాకేజీ మంచి ప్రయత్నమని ప్రశంసించింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. ఇది భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ఉపకరిస్తుందని అభిప్రాయపడింది. ఇంకా ఏం చెప్పిందంటే..?
ఆరు రోజుల నష్టాలకు బ్రేక్- వారాంతంలో బుల్ జోరు
అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లలో వారాంతంలో బుల్ జోరు కొనసాగింది. ఆరు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ.. సెన్సెక్స్ 835 పాయింట్లు బలపడి 37,400 మార్క్‌కు చేరువైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రేక్షకుల పరిమితి కుదింపు
ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రేక్షకుల పరిమితిని వేయికి తగ్గించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
గావస్కర్‌పై అనుష్క ఫైర్..
తనతో పాటు భర్త కోహ్లీని, గావస్కర్ విమర్శించడంపై నటి అనుష్క శర్మ స్పందించింది. ఈ విషయమై వివరణ ఇవ్వాలని కోరింది. తన పేరు ఉపయోగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. గావస్కర్ వ్యాఖ్యలు ఏంటంటే..?