దివికేగిన గానగంధర్వుడు- ఎస్పీ బాలు అస్తమయం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) శుక్రవారం కన్నుమూశారు. ఆగస్టు 5న కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన బాలు.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఆత్మీయ సోదరుడు లేరంటే బాధగా ఉంది: రామోజీరావు
ఎస్పీ బాలు ఇక లేరంటే... బాధగా, దిగులుగా ఉందని రామోజీరావు విచారం వ్యక్తం చేశారు. ప్రపంచ సంగీతానికే ఆయన స్వరం ఓ వరం అని వ్యాఖ్యానించారు. ఇంకా ఎస్పీబీ గురించి రామోజీరావు ఏం తెలిపారంటే..?
ఎస్పీ బాలు మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతాపం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. బాలు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాలు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. ఇంకా వారు ఏం చెప్పారంటే..?
సంగీత సామ్రాట్ జీవితం.. పాటకే అంకితం
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయనే మనమంతా ఆప్యాయంగా పిలుచుకునే ఎస్పీ బాలు. అసమాన ప్రతిభా పాటవాలతో వేలాది పాటలకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు. తెలుగు పాట ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సంగీత విద్వాంసుడు. ఆయన గురించి పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
వ్యవసాయబిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు
కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లును వ్యతిరేకిస్తూ... రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలు నిర్వహించారు. నిరసనకారులు కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
పరువు హత్య
రాష్ట్రంలో పరువు హత్యలు ఆగడం లేదు. హైదరాబాద్ చందానగర్‌కు చెందిన హేమంత్(26) అదే ప్రాంతానికి చెందిన అవంతి(23) గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు 2020 జూన్ 11న కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ పెళ్లి చేసుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఆస్తి కోసం
ఒక్కగానొక్క కొడుకు కదా అని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వైభవంగా పెళ్లి జరిపించారు. తాము పడ్డ కష్టాలు కొడుకు, కోడలు పడకూడదని ఉన్న ఇల్లు, పొలం అమ్మేసి పట్నంలో మంచి ఇల్లు కొనిచ్చారు. చివరికి ఆ ఇంట్లో ఉండటానికి వారికే చోటు కరవైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
'వ్యవసాయ బిల్లులతో బానిసలుగా రైతులు'
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతులు బానిసలుగా మారతారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా వివిధ సంఘాలు పిలుపునిచ్చిన 'భారత్ బంద్'కు మద్దతు ప్రకటించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే..?
'ఇక విదేశీ యుద్ధాలకు అమెరికా స్వస్తి'
అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతులేని 'విదేశీ యుద్ధాలకు' ఇక అమెరికా దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇంకా ఏం వెల్లడించారంటే..?
క్రికెటర్ రాహుల్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్లో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఇప్పటికే ఈ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడగా.. క్రిస్ గేల్‌కు మాత్రం తుదిజట్టులో చోటు దక్కలేదు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు పంజాబ్ సారథి రాహుల్. ఏమన్నాడో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.