1. ఎవరు గెలిస్తే లాభం?
అగ్రరాజ్యం ఎన్నికలు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతాయి. దీంతో ఈ సారి అమెరికా ఎన్నికలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే అగ్రరాజ్యాధినేతగా ఎవరు ఎన్నికైతే భారత్‌కు ప్రయోజనాలు చేకూరుతాయి? భారత్-అమెరికా మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? వంటి ప్రశ్నలపై రాజకీయ పరిశీలకులు ఏం చెబుతున్నారు..? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ట్రంప్xబైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభించినా.. పూర్తి ఫలితాలు వచ్చేందుకు చాలా రోజుల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఓటింగ్‌లో పోలైన ఓట్ల లెక్కింపు.. సర్వేల అంచనాలను చూసి విజేత విషయంలో స్పష్టమైన అభిప్రాయానికి రాలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్షణక్షణం మారిపోయే ఫలితాలతో ఒక్కో సమయంలో ఒక్కో పార్టీ ఆధిక్యంలోకి వస్తుంది. అందుకే తుది ఫలితం తేలే వరకు తదుపరి అధ్యక్షుడిని నిర్ణయించడం సవాలే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ప్రశాతంగా ముగిసిన పోలింగ్
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరోనా నేపథ్యంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ భారతి హొళికెరితో పాటు ఉన్నతాధికారులు... ఎన్నికల సరళిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీపీ జోయెల్ డేవిస్ శాంతి భద్రతలు పర్యవేక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. భాజపాదే విజయం
దుబ్బాక ఉపఎన్నికలో భాజపాదే విజయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయేనని చెప్పారు. ఒకరు భర్త పేరుతో.. మరొకరు తండ్రి పేరుతో పోటీ చేశారని విమర్శించారు. ఓటుకు రూ.5 నుంచి రూ.10 వేలు పంచారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. నంబర్‌వన్ చేస్తాం
2030 వరకు లైఫ్ సైన్సెస్ విభాగంలో తెలంగాణ ఆసియాలోనే ప్రధాన క్లస్టర్‌గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ విజన్ 2030 రిపోర్టును ఆయన విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. బిహార్ చేసిన తప్పు
బిహార్ ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఓటు వేసి చేసిన పొరపాటును సరిదిద్దుకునే సమయం వచ్చిందని అక్కడి ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. యూఏఈ ప్రధానికి టీకా
యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషిద్ అల్ మాక్తొమ్ మంగళవారం కొవిడ్ టీకా వేయించుకున్నారు. వాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు రాత్రింబవళ్లు శ్రమించిన వైద్య బృందం పట్ల గర్వంగా ఉందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ప్రధాని. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. మరో ఉద్దీపన ప్యాకేజీ
కేంద్రం త్వరలోనే మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించినున్నట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ప్యాకేజీపై చర్చలు జరుగుతున్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. ప్యాకేజీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. అందుకే పతకం సాధించగలిగా
శిక్షణా శిబిరంలో వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేయడం వల్లే 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించానని తెలిపింది భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. మార్పేదీ రాలేదు
వివాహం తర్వాత తన వ్యక్తిగత జీవితంలో పెద్దగా మార్పులేవీ జరగలేదని అంటున్నాడు నటుడు రానా దగ్గుబాటి. కానీ, పెళ్లైన తర్వాత మరింత బాధ్యతాయుతంగా మారినట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.